బాలయ్య డేంజర్.. మూడు వారాలైనా మౌనమేనా?

0

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ఇంకా టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ విషయమై గత కొన్ని నెలలుగా మీడియాలో పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు డేంజర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతకు ముందు మోనార్క్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అందుకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ రాలేదు. దాంతో ఆ టైటిల్ గురించి జనాలు మాట్లాడుకోవడం మానేశారు.

గత మూడు వారాలుగా ఈ సినిమాకు ‘డేంజర్’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో కూడా చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. అలా అని ఈ వార్తలు నిజం కావు అనే విషయంలో కూడా వారు స్పందించలేదు. సాదారణ పుకార్లు అయితే ఒకటి రెండు రోజుల్లో కనిపించకుండా పోతాయి. కాని చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయాన్ని లీక్ చేసి ఉంటారేమో అందుకే మూడు వారాలు అయిన ఇంకా ప్రచారం జరుగుతూనే ఉన్నాయి.

గతంలో డేంజర్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు అల్లరి నరేష్ హీరోగా కృష్ణవంశీ ఒక సినిమాను తీసుకు వచ్చాడు. ఆ సినిమా నిరాశ పర్చింది. అయితే ఆ సినిమా టైటిల్ ఇప్పుడు బాలయ్య మూవీకి ఉపయోగించాలనే నిర్ణయానికి వచ్చారని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కనుక ఖచ్చింగా బాలయ్య ‘డేంజర్’గానే వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.