రియా అరెస్ట్ .. ఆమె చెప్పిన ఆ 25మంది ఎవరు?

0

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతర పరిణామాలు సంచలనంగా మారాయి. ఈ కేసులో సీబీఐ సహా నార్కోటిక్స్ .. ఈడీ దర్యాప్తుతో రకరకాల సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇందులో వరుసగా అరెస్టుల ఫర్వం ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా ప్రమాదకర మాదక ద్రవ్యాల క్రయవిక్రయాల్లో నేరుగా సంబంధాలు ఉన్న వారందరినీ నార్కోటిక్స్ బృందాలు అరెస్టులు చేస్తూ సంచలనానికి కారణమవుతున్నాయి. ఈ కేసులో తాజాగా రియా చక్రవర్తి అరెస్టవ్వడం సెన్సేషన్ అయ్యింది. ఇక ఈ కేసులో రియా చక్రవర్తి దాదాపు 25 మంది ప్రముఖుల పేర్లను రివీల్ చేసిందన్న ప్రచారం అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇందులో పలువురు పెద్దన్నలకు చిక్కులు తప్పవన్న అంచనా వెలువడింది.

ఇంతకీ ఇంటరాగేషన్ లో రియా చెప్పిన ఆ 25 మంది ఎవరు? అంటూ సోషల్ మీడియాల్లో డిబేట్ వేడెక్కించేస్తోది. సచిన్ అనే ఓ అభిమాని స్పందిస్తూ ట్విట్టర్ లో పలు పేర్లను సూచించాడు. రియా అరెస్ట్ తర్వాత పిపిఎల్ ను అనుసరించడం చాలా విచారంగా ఉంటుంది అంటూ.. పలువురి పేర్లను రివీల్ చేశాడు. రాజ్ దీప్ దేశాయ్ (జర్నలిస్ట్)- ఆమె కుటుంబం- మన్షిండే లాయర్ – పన్నూ & స్వరా- ఫరా ఖాన్- భట్ సాబ్- బాంద్రా పోలీసులు- రాహుల్ కన్వర్ .. వీళ్లంతా ఎంతో బాధపడి ఉంటారు! అంటూ అతడు అన్నాడు. మరింతమంది పేర్లను సూచించండి అంటూ క్విజ్ పోటీ పెట్టాడు. అన్నట్టు రియా రివీల్ చేసిన పేర్లలో వీళ్లు ఎవరైనా ఉన్నారా? అంటూ సోషల్ మీడియాల్లో హాట్ డిబేట్ రన్ అవుతోంది.