NCB విచారణలో దీపిక 3 సార్లు కేకలు వేస్తూ ఏడ్చేశారట!?

0

శాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో ట్విస్టులు ఊపిరాడనివ్వడం లేదు. ఇందులో డ్రగ్స్ కోణంపై ఎన్.సి.బి విచారణ సంచలనంగా మారింది. ప్రముఖ జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఎన్సిబి ప్రశ్నించే సమయంలో మూడు సార్లు మనసు విరిగి కేకలు వేస్తూ దీపిక పదుకొనే ఏడ్చేశారని తెలుస్తోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ప్రశ్నించినప్పుడు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మూడుసార్లు కేకలు వేసిందని ఆ కథనం పేర్కొంది. బాలీవుడ్ పరిశ్రమతో సంబంధాలు ఉన్న పెద్ద మాదకద్రవ్యాల పెడ్లర్ ను విచారించడం ద్వారా మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో అధికారులు తమ దర్యాప్తు పరిధిని విస్తృతం చేయాలని చూస్తున్నారని ఈ వార్తా కథనం వెల్లడించింది. పెడ్లర్ల వాంగ్మూలాన్ని కోర్టుకు ఇస్తామని ఎన్.సి.బి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎంఏ జైన్ పేర్కొన్నట్లు సదరు జాతీయ మీడియా కథనంలో పేర్కొంది.

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసులో ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్న డ్రగ్స్ కోణానికి సంబంధించి దాదాపు 18-19 మందిని అరెస్టు చేసినట్లు ఎన్.సి.బి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నట్లు సదరు మీడియా కథనం పేర్కొంది. దివంగత నటుడి మరణ కేసుపై ఎన్సిబి మాత్రమే కాదు.. సిబిఐ.. ఈడి కూడా దర్యాప్తు చేస్తున్నాయి. రాజ్పుత్ కేసును సుప్రీంకోర్టు గతంలో సిబిఐకి అప్పగించింది. డ్రగ్స్ కేసులో దీపికా పదుకొనే సహా శ్రద్ధా కపూర్- సారా అలీ ఖాన్లను కూడా ఎన్.సి.బి ప్రశ్నించింది.

నటి దీపికా పదుకొనే డ్రగ్ చాట్ చేసినట్లు అంగీకరించినప్పటికీ.. ఎప్పుడూ డ్రగ్స్ వినియోగించలేదని మీడియా కథనాల్ని వాదనలను ఖండించినట్లు తాజా జాతీయ మీడియా కథనం పేర్కొంది. నటి సారా అలీ ఖాన్ కూడా ఆమె మాదకద్రవ్యాలను పుచ్చుకోనని.. అన్ని వాదనలను ఖండించారు. తాను ఎప్పుడూ ఎలాంటి మాదకద్రవ్యాలను సేవించలేదని పేర్కొంది. తాజాగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనేను ఎన్.సి.బి ప్రశ్నించినప్పుడు మూడు సార్లు తీవ్రంగానే ఎమోషన్ అయినట్టుగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.