Templates by BIGtheme NET
Home >> Cinema News >> Pooja Hegde Saree: పూజా హెగ్డే కట్టుకున్న చీర ధర ఎంతో తెలుసా?

Pooja Hegde Saree: పూజా హెగ్డే కట్టుకున్న చీర ధర ఎంతో తెలుసా?


Pooja Hegde Saree: సినిమా అంటేనే రంగుల లోకం.. ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టమంటారు. ఒకసారి అన్నీ వదిలేసి నిలదొక్కుకున్నామా? ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. డబ్బు, పరపతి అవే వచ్చి పడుతాయి. హిట్స్ పోకుండా కష్టపడితే చాలు..

హీరోయిన్లకు హిట్స్ వస్తే వారి జీవితాలే మారిపోతాయి. వారంతా ఖరీదైన జీవితాలను గడిపేస్తారు. వారు ఉపయోగించే ఉపకరణాలు చాలా ఖరీదైనవి ఉంటాయి. తాజాగా టాలీవుడ్ బుట్టబొమ్మ.. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఆమె ఓ ఖరీదైన చీరను కట్టుకొని ఓ సినిమా ఫంక్షన్ కు హాజరైంది. ఆ చీర ఖరీదు ఎంతో తెలిస్తే నిజంగానే అవాక్కవడం గ్యారెంటీగా కనిపిస్తోంది.

ఇటీవల పూజా హెగ్డే పసుపురంగు డిజైనర్ చీర కట్టుకొని అవార్డుల ఫంక్షన్ లో కనిపించింది. బంగారు రంగులోని జాకెట్ వేసుకొని కనిపించిన పూజా హెగ్డే అందాలు అందరినీ ఆకర్షించాయి. ఇదేదో అల్లటప్పా చీర కాదు.. ఈ చీరను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్పిత మెహతా రూ.48,000 ధరతో డిజైన్ చేశారు.

పూజా హెగ్డే గత వారం లాక్మే ఫ్యాషన్ ఈవెంట్ కు హాజరైంది. చాలామంది అసూయపడేలా రూ.2లక్షల విలువైన లెహంగానే ఆ ఈవెంట్ లో ధరించింది. ఆమె తన డ్రెస్ తో షోలోనే అందరినీ తనవైపు తిప్పుకుంది.

సాధారణంగా పూజా హెగ్డే సాంప్రదాయ దుస్తులలో అరుదుగా కనిపిస్తుంటుంది. కానీ ఆమె ఇలా డిజైనర్ దుస్తులు ధరించినప్పుడు చూస్తే మరింత ఆకర్షనీయంగా ఉంటుంది. అయితే అవి చాలా ఖరీదైనవి కావడం విశేషం.

స్టార్ హీరోయిన్ అయ్యాక పూజా హెగ్డే చీరలు, దుస్తులు మాత్రమే కాదు.. గాగుల్స్, ఫుట్ వేర్, హ్యాండ్ బ్యాగులు వంటి ఉపకరణాలు చాలా ఖరీదైనవే వాడుతోంది. పూజా ఉపయోగించే ప్రతి ఒక్కటి అంతర్జాతీయ బ్రాండ్ లు.. అవి అన్నింటికి చాలా ఎక్కువ ధర కలిగి ఉంటాయి. అంత దాకా ఎందుకు… పూజా హెగ్డే ఉపయోగించే లూయిస్ విట్టన్ బ్యాగ్ రూ.2.6 లక్షలు కావడం గమనార్హం.