రాక్ స్టార్ నూ వదలని కరోనా!

0

కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఈ వ్యాధి బారినపడి పలు రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఆస్పత్రి పాలవుతున్నారు. తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ది రాక్ డ్వెయిన్ జాన్సన్ కి కరోనా తేలింది. అతడి భార్య లారెన్ కుమార్తెలు జాస్మిన్ టియానాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని రాక్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో విడుదల చేస్తూ ప్రకటించాడు. వరల్డ్ రెజ్లింగ్ పోటీల్లో జాన్సన్ ఎన్నో విజయాలు అందుకుని మోస్ట్ పాపులర్ గా పేరుతెచ్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారి ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ఒకడిగా మారాడు. అతడు ద స్కార్పియన్ కింగ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ జుమాంజీ వంటి సినిమాల్లో నటించి స్టార్డం సంపాదించాడు.

జాన్సన్ ఇన్ స్టాలో వీడియో విడుదల చేస్తూ ‘నేను నా భార్య ఇద్దరు పిల్లలు కరోనా బారిన పడ్డాం. చాలా క్రమశిక్షణతో ఉన్నా రెండు వారాల క్రితం వైరస్ సోకింది. తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారానే వైరస్ సంక్రమించింది. అయితే దీన్ని మేం ఒక ఛాలెంజింగ్ లాగా తీసుకోవాలని అనుకుంటున్నాం. ఇలాంటి ఛాలెంజ్ ని మా జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోలేదు. మొదట కరోనా నా ఒక్కడికి మాత్రమే వచ్చిందని అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది. నా భార్య పిల్లలు కూడా వచ్చిందని.ఇప్పుడు నా కుటుంబాన్ని రక్షించుకోవడం నా బాధ్యత. అందరూ మాస్కు ధారణ తప్పనిసరి చేసుకోవాలి. అప్పుడే మనం ఈ వ్యాధి నుంచి దూరంగా ఉండవచ్చని’ రాక్ సూచించాడు.