బికినీలో బంతాడేస్తున్న హాటీ

0

గత కొంతకాలంగా ఎల్లీ అవ్ రామ్ మాల్దీవుల విహారంలో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒంటరి దీవుల్లో సూర్యుడు నేను తప్ప ఇంకెవరూ లేరు! అంటూ కుర్రకారును కొంటెగా కవ్వించింది. బికినీ బీచ్ నుంచి సోలో ఫోటోషూట్లు వీడియోల్ని రివీల్ చేస్తూ అంతకంతకు హీట్ పెంచేస్తోంది.

తాజాగా ఇదే కోవలో మరో ఫోటోని ఎల్లీ అభిమానుల కోసం షేర్ చేసింది. ఈ ఫోటోలో క్యూబాల్ ఆడుతున్న ఎల్లీ బికినీతో షేక్ చేస్తున్న విధానం బోయ్స్ కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

అసలు ఎల్లీ ఎవరు? అన్నది ఆరా తీస్తే ఈ అమ్మడు స్వీడన్ కి చెందిన టాప్ మోడల్ సింగర్ డ్యాన్సర్. ఎలిసాబెట్ అవ్రామిడౌ గ్రాండ్ అనేది తన అసలు పేరు. 29 జూలై 1990 లో జన్మించింది. వృత్తిపరంగా ఎల్లీ అవ్రమ్ గా మారింది. తను స్వీడిష్ గ్రీకు నటి .. ఇప్పుడు భారతదేశంలోని ముంబైలో నివశిస్తోంది. ఆమె బాలీవుడ్ చిత్రం మిక్కీ వైరస్ తో తెరకు పరిచయం అయ్యింది. ఇండియన్ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ లో పాల్గొన్న తరువాత అవ్రమ్ పేరు సినీప్రపంచంలో మరింత పాపులరైంది.

ఎల్లీ అవ్రమ్ రామ్ 29 జూలై 1990 న స్వీడన్ నగరం స్టాక్ హోమ్ లో జన్మించింది. ఆమె గ్రీకు తండ్రి.. జన్నిస్ అవ్రామిడిస్ మంచి సంగీతకారుడు. ఇప్పుడు స్వీడన్లో స్థిరపడ్డారు. ఆమె తల్లి మరియా గ్రాన్లండ్ గొప్ప నటి. అవ్ ర్రామ్ ఆరంభం ఫిగర్ స్కేటింగ్.. గానం నృత్యాలపై ఆసక్తి చూపింది. అవ్రమ్ స్వీడన్లోని స్కోన్ కౌంటీలో థియేటర్ నడుపుతున్న ఆమె తల్లి అత్త నుండి నటనలో శిక్షణ పొందారు. అవ్రమ్ తన చిన్నతనం నుంచీ భారత్తో సంబంధాన్ని కలిగి ఉంది.

స్థానిక స్టాక్హోమ్ వార్తాపత్రిక మిట్ ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు ఐదు సంవత్సరాల వయసులో కూడా భారతీయ నృత్యం .. రంగురంగుల బట్టలు చూసి ఆకర్షితురాలినయ్యాను అని అన్నారు. ఆమె తండ్రి గ్రీకు సంగీత విద్వాంసుడు కాబట్టి కొన్ని గ్రీకు పాటలు భారతీయతకు సంబంధించినవి అని ఆమె కనుగొంది. అవ్రమ్ తన కౌమారదశ నుండి బాలీవుడ్ నటి కావాలని కలలు కంది. ఆమె స్టాక్ హోమ్ లోని ఒక వీడియో స్టోర్ కు వెళ్లి హిందీ సినిమాల సీడీలు అమ్మేది. అక్కడ నుంచే బాలీవుడ్ సినిమా సీడీలు కొనేది. ఆమె యూట్యూబ్ లో హిందీ చిత్రాలను చూసేది. అటుపై అనుకున్నది సాధించుకుంది. హిందీ చిత్రసీమలో ఎల్లీ ఇప్పుడు పాపులర్ నటిగా రాణిస్తోంది.