ఎక్స్పైరీ డేట్ ట్రైలర్ టాక్

0

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ జీ5 ”ఎక్స్పైరీ డేట్” అనే బై లింగ్వల్ వెబ్ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. స్నేహా ఉల్లాల్ – మధు షాలిని – టోనీ లూక్ – అలీ రెజా ప్రధాన పాత్రల్లో రూపొందించబడిన ఈ వెబ్ సిరీస్ కి శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహించారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై శరత్ మరార్ నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ సిరీస్ కు సంగీతం అందించారు. తెలుగు – హిందీ భాషలలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ హిందీ వర్షన్ ని అక్టోబర్ 2న ‘జీ 5’ లో విడుదల చేశారు. ఈ క్రమంలో పది ఎపిసోడ్స్ తో కూడిన తెలుగు వర్షన్ ‘ఎక్స్పైరీ డేట్’ ని అక్టోబర్ 9న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.

కాగా ట్రైలర్ డిసెంబర్ 17న గుంటూరులో అగర్వాల్ పెళ్లికి వెళ్లిన తన భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో టోనీ లూక్ కంప్లైంట్ ఇవ్వడంతో ప్రారంభమైంది. అదే అగర్వాల్ పెళ్లికి వెళ్లిన తన భర్త కనపడడం లేదని మరో మహిళ కంప్లైంట్ ఇచ్చిందని పోలీసులు చెప్తారు. ఆ రెండు కేసులకు సంభంధం ఏంటి? కనిపించకుండా పోయిన వాళ్ళిద్దరికీ ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రేమ – మోసం – నమ్మకం – చీకటి సంబంధాలు – ప్రతీకారంతో ఊహించని మలుపులతో ఉన్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే అన్నిటికి ఎక్స్ పైరీ డేట్ ఉన్నట్లే మరి రిలేషన్ షిప్స్ కి కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుందో లేదో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

‘ఎక్స్ పైరీ డేట్’ తో వెబ్ వరల్డ్ లో అడుగుపెడుతున్న స్నేహ ఉల్లాల్ మాట్లాడుతూ ”ఈ వెబ్ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. పది ఎపిసోడ్స్ తో ఉండే ఈ సిరీస్ లో థ్రిల్లింగ్ అంశాలు.. ఊహించని మలుపులు ఉంటాయి. జీ 5లో ఈ సిరీస్ విడుదల అవుతున్నందుకు సంతోషంగా ఉంది. అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకులు ఈ సిరీస్ చూస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు. ఇక వెబ్ సిరీస్ నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ ‘తెలుగు హిందీ భాషలలో రూపొందిన తొలి వెబ్ సిరీస్ ‘ఎక్స్పైరీ డేట్’. రెండు భాషల్లోని టాలెంటెడ్ యాక్టర్స్ తో దీన్ని రూపొందించాం. అందరూ అద్భుతంగా నటించారు. జీ 5లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ను నిర్మించినందుకు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ చాలా సంతోషంగా ఉంది” అని చెప్పుకొచ్చారు.