‘ఎఫ్ 3’ కోసం ఆ ‘3’ కలుస్తున్నారా…?

0

విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2’ గతేడాది సంక్రాంతికి విడుదలై సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం వరల్డ్ వైడ్ గా వంద కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. మిల్కీ బ్యూటీ తమన్నా – మెహరీన్ హీరోయిన్ లుగా నటించిన చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా ఎండ్ కార్డులోనే సీక్వెల్ ‘ఎఫ్ 3’ వున్నట్టు ప్రకటించిన దర్శకుడు అనిల్.. ప్రస్తుతం అదే పనిలో బిజీగా వున్నాడు. ఇప్పటికే లాక్ డౌన్ సమయంలో ఈ సీక్వెల్ స్క్రిప్ట్ ని అనిల్ అండ్ టీమ్ రెడీ చేసారని తెలుస్తోంది. ఇటీవలే ఇద్దరు హీరోలు కూడా అనిల్ రావిపూడి ఫైనల్ నెరేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాదాపు ‘ఎఫ్ 2’ క్యాస్టింగ్ ఈ సీక్వెల్ లో ఉంటారని అనిల్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు. నిన్న కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి అనిల్ రావిపూడితో కలిసి తీసుకున్న ఫోటోని షేర్ చేయడం వల్ల ‘ఎఫ్ 3’ పనులు షురూ అయ్యాయని అర్థం అవుతోంది.

ఇదిలా ఉండగా ‘ఎఫ్ 2’ ని ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు ఈ సీక్వెల్ ని కూడా నిర్మించనున్నారు. అయితే ‘ఎఫ్ 3’ కోసం మరో ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టనున్నారట. ఈ మధ్య వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్న ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర కూడా ఈ సీక్వెల్ నిర్మాణంలో భాగం పంచుకోనున్నారని సమాచారం. అలానే వెంకటేష్ హోమ్ బ్యానర్ సురేశ్ ప్రొడక్షన్స్ వారు కూడా జత కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే ‘ఎఫ్ 3’ లో మూడు రెట్లు ఎంటర్టైన్మెంట్ కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా ముగ్గురు ఉండబోతున్నారన్నమాట. ఇక ఈ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మీక మందన్నతో స్పెషల్ అప్పీరెన్స్ ఇప్పించడానికి అనిల్ ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ పరిచయంతో అమ్మడు ఈ ఆఫర్ కి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.