బాలీవుడ్ వైఫ్స్ ట్రైలర్ టాక్

0

బాలీవుడ్ ఫేజ్ 3 సెలబ్రిటీల జీవితాలపై సెటైరికల్ సినిమాలు తీయడంలో మధుర్ భండార్కర్ లాంటి జాతీయ అవార్డ్ గ్రహీతకు కొత్తేమీ కాదు కానీ.. ఇప్పుడు అదే తరహాలో నెట్ ఫ్లిక్స్ రియాలిటీ టీవీ షో ఒకటి హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ స్టార్ వైఫ్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్టుతో రూపొందించిన బాలీవుడ్ వైఫ్స్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. నలుగురు స్టార్ హీరోల భార్యల లైఫ్ స్టైల్ ఇదీ .. ఇలా ఉంటుంది! అంటూ ఇందులో చూపిస్తుండడం ఎంతో ఫన్నీగా సెటైరికల్ గానూ ఉంది.

అన్నట్టు ఈ రియాలిటీ షోకి ఎవరితో ప్రచారం చేయించారు? అంటే కింగ్ ఖాన్ షారూక్ వైఫ్ గౌరీఖాన్ తో ప్రచారం చేయించడం ఆసక్తికరం. అంటే ఆ నలుగురు భార్యల్లో ఒకరు గౌరీఖాన్ అన్న సంగతిని ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. భార్యలు షాపింగ్ కి వెళితే.. కార్ చికాకు పెడితే .. రోడ్ లో వయ్యారంగా నడుస్తుంటే.. లగ్జరీ కార్ లోంచి దిగుతుంటే.. పగలబడి నవ్వేస్తుంటే.. ఇలా రకరకాల యాంగిల్స్ లో భార్యామణుల్ని స్టడీ చేసి అవన్నీ ఎలా ఉంటాయో ఫన్నీ డైలాగులతో చూపించారు. అంతేకాదు స్టార్ వైఫ్స్ కి లైనేసే కుర్రహీరోని కూడా ఇందులో చూపించిన తీరు ఎంతో రొమాంటిక్ గా అలరించింది. అయితే ఈ సిరీస్ ని ఇప్పటికే వీక్షించిన వారెవరూ మరీ అంత గొప్ప రేంజులో వర్కవుట్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యారని విమర్శించారు. కొంతవరకూ కనెక్టివిటీ కుదిరిందట.

నెట్ఫ్లిక్స్ తాజా రియాలిటీ టీవీ షో ఫ్యాబ్యులస్ లివ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్.. ఎనిమిది ఎపిసోడ్ల సిరీస్ ..మహీప్ కపూర్- నీలం కొఠారి సోని- సీమా ఖాన్- భవానా పాండే నటీమణులుగా కనిపిస్తున్నారు. ది రియల్ గృహిణులు బెవర్లీ హిల్స్ … కీపింగ్ అప్ విత్ ది కర్దాషియన్స్.. సెక్స్ అండ్ ది సిటీ లాంటి హాలీవుడ్ షోస్ స్ఫూర్తితో రూపొందిన షో ఇది.

ఈ నలుగురు నటీమణులు టాబ్లాయిడ్లు ప్రముఖ సోషల్ మీడియా పోస్టులలో పాప్-అప్ ప్రదర్శనల నుండి బాగా ప్రసిద్ది చెందినవారు. మహీప్- సీమా- భవన నిర్మాణ అసోసియేషన్ ద్వారా ప్రసిద్ది చెందగా నీలం గోవింద.. చంకీ పాండే సరసన పలు చిత్రాలలో నటించారు.