సాయి పల్లవి డేరింగ్ డిసీజన్.. దండం పెట్టి మరీ ఆ మాట అనేసిన గరికపాటి..!

0

యంగ్ హీరోయిన్స్ అంతా కెమెరా ముందు గ్లామర్ ఒలకబోయడమే పనిగా పెట్టుకుంటున్న రోజులివి. సెట్స్ మీదకొస్తే చాలు అందాల ఆరోబోతతో ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా దూసుకుపోతున్నారు కొందరు హాట్ హీరోయిన్స్. ఇంకొందరు సెక్సీ స్టార్స్ అయితే ఏకంగా సోషల్ మీడియాలో బికినీలు వేసి రచ్చ రచ్చ చేస్తూ అందరి దృష్టి తమపై పడేలా చేసుకుంటున్నారు. అలాంటి ఈ పరిస్థితుల్లో నాచురల్ బ్యూటీ

సాయి పల్లవి తీసుకున్న ఓ డిసీజన్ నిజంగా అందరికీ ఆశ్చర్యపర్చింది. దీంతో ఆమె తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు స్పందించారు.

సాధారణంగా సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ హీరోయిన్ల తీరును, వారు వేసే దుస్తులను సెటైర్స్ వేస్తుంటారు ప్రవచనకర్తలు. సమాజంలో స్త్రీ విలువలు, వేషాధారణ గురించి మాట్లాడుతూ నేటి తరం హీరోయిన్స్‌పై ఓ రేంజ్ కామెంట్స్ చేస్తుంటారు. కానీ ఫస్ట్‌టైమ్ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు హీరోయిన్ సాయి పల్లవి తీరును మెచ్చుకున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు కెమెరా ముందు పొట్టి దుస్తులు వేసి నటించడం ఇష్టముండదని, అలాంటి పని తాను చేయనని సాయి పల్లవి చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ తన ఫీలింగ్స్ చెప్పారు గరికపాటి.

పదునైన ఛలోక్తులు, సందర్భానుసార సామెతలతో, హాస్యాస్పద సంగతులతో అందరినీ కట్టి పడేస్తూ ప్రవచనాలు చెప్పే గరికపాటి నరసింహారావు.. హీరోయిన్ సాయి పల్లవి తీసుకున్న ఈ నిర్ణయంపై భావోద్వేగ పూరిత కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో హీరోయిన్ల పోకడకు బిన్నంగా సాయి పల్లవి డిసీజన్ తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొంటూ ఆమెకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అన్నారు.

నా సినిమాను తల్లిదండ్రులు చూస్తుంటే ఇబ్బంది పడకూడదు. అలాగే రేపు నా పిల్లలు చూసినా సిగ్గు పడకూడదు అంటూ కురచ దుస్తులు ధరించడంపై సాయి పల్లవి స్పందించిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని గరికపాటి నరసింహారావు చెప్పడంతో ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది చూసిన సాయి పల్లవి ఫ్యాన్స్ గరికపాటికి స్పెషల్ థాంక్స్ చెబుతూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.