`ఆదిపురుష్ 3డి` ఆఫర్ పై కియరా ఏమంది?

0

ప్రభాస్ కథానాయకుడిగా నటించనున్న `ఆదిపురుష్ 3డి` ప్రస్తుతం బాలీవుడ్ టౌన్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో ప్రభాస్ శ్రీరాముడుగా నటిస్తున్నారని.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రకు ఎంపికయ్యారని ప్రకటనలు రాగానే ఉత్తరాది అభిమానులు ఒక్కసారిగా సోషల్ మీడియాల్లో ఆరాలు తీసారు. బాహుబలి స్టార్ నుంచి మరో భారీ పాన్ వరల్డ్ మూవీ చూడబోతున్నామన్న ఆసక్తిని కనబరిచారు.

అయితే ఇందులో సీత పాత్రలో ఎవరు నటిస్తారు? అన్నదానిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. కియరా అద్వాణీ సీతగా నటిస్తుందన్న ప్రచారం సాగిపోయింది. అయితే ఇదే ప్రశ్నను ఒక అభిమాని కియారాను అడిగాడు. మరిన్ని సౌత్ చిత్రాలలో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నా! అని ఆ అభిమాని అనగానే.. దానికి సమాధానమిస్తూ “మీరు త్వరలో దానిని చూస్తారు” అని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది కియరా.

ఆదిపురుష్ లో సీతాదేవి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుందని అభిమానులు ఊహిస్తున్నారు. ఇప్పుడు కియారా ఈ చిత్రంలో ఎలాంటి పాత్ర చేస్తుంది? అన్నది సస్పెన్స్ గా మారింది. కియరా వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఓం రౌత్ కి టచ్ లోనే ఉందని అర్థమవుతోంది. ముంబై-హైదరాబాద్ లింక్ ఉన్న హీరోయిన్ గా కియరా ఈ మూవీకి కలిసొచ్చే ఆప్షనే. అందువల్ల తనకు ఏ పాత్రలో నటించే వీలుంది? అన్నది తేల్చాల్సి ఉంటుంది. అయితే ఇంతకుముందు `చంద్రముఖి 2`లో కియరా నటిస్తుందని తొలుత ప్రచారం సాగినా ఆ ఆఫర్ మిస్ అయ్యింది. ఈసారి అలా జరగదనే ఆశిద్దాం. ఇక ఇందులో సైఫ్ ఖాన్ ఈ చిత్రంలో ‘అత్యంత తెలివైన రాక్షస రాజు’ లంకేష్ పాత్రను పోషించనున్నారు.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ సాగుతోంది. ఈ చిత్రం 2021లో ప్రారంభమై 2022 లో థియేటర్లలోకి వస్తుందని భావిస్తున్నారు. టి-సిరీస్ బ్యానర్ లో భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.