పవన్ రాజకీయాలపై ప్రశ్న..దుమ్ముదులిపిన హరీష్ శంకర్

0

ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ ఆయనతో కొత్త సినిమాను ప్రకటించాడు. పవన్ బర్త్ డే సందర్భంగా గబ్బర్ సింగ్ దర్శకుడు చేసిన ఈ ప్రకటన అభిమానుల్లో జోష్ నింపింది. పోస్టర్ ఆసక్తి రేపింది.

ఈ క్రమంలోనే దర్శకుడు హరీష్ మీడియాతో ముచ్చటించారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడిన హరీష్ శంకర్ తాను పవన్ కళ్యాణ్ తో తీయబోయే కొత్త సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఈ క్రమంలోనే సదురు చానెల్ రిపోర్టర్ నుంచి హరీష్ శంకర్ కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ‘పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయారని.. దీనిపై మీ అభిప్రాయం ఏంటని’ హరీష్ శంకర్ ను ప్రశ్నించాడు రిపోర్టర్. దీనికి హరీష్ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు. ‘మీరు వృథాప్రయాస చేస్తున్నారు. సినిమా దర్శకుడిని సినిమాల గురించి అడగాలి.. రాజకీయాల గురించి కాదు.. నేనేమైనా మీ చానెల్ ఎండీనా? మీ భాష ఏంటి? నేనే విశ్లేషణ చేయడం ఏంటి’ అంటూ సదురు రిపోర్టర్ ను కడిగిపాడేశాడు.

అయినా ఆపకుండా పవన్ రాజకీయ జీవితంపై ప్రశ్నలు అడిగిన రిపోర్టర్ ఏంటి ఈ వృథా ప్రయాస అంటౌ కౌంటర్ ఇచ్చారు.

ఇలా హరీష్ శంకర్ తోనే పెట్టుకున్న ఆ చానెల్ రిపోర్టర్ లైవ్ లో బుక్కయ్యాడు. తెరపైనే మాటలు పేల్చడమే కాదు.. బయట కూడా హరీష్ శంకర్ ఫైర్ బ్రాండ్ అని ఈ ఘటనతో నిరూపించుకున్నాడు.