Templates by BIGtheme NET
Home >> Cinema News >> తల్లి కాబోతున్న యాంకర్ హరితేజ..!

తల్లి కాబోతున్న యాంకర్ హరితేజ..!


బిగ్బాస్ ఫేమ్ ప్రముఖనటి యాంకర్ హరితేజ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. తాను త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నానని.. తనకు ఎంతో ఆనందంగా ఉందని ఇన్స్టాలో వీడియో పోస్ట్చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు నెట్జన్లు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఇటీవల లాక్ డౌన్ లో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. బిగ్ బాస్ హౌస్ ద్వారా హరితేజ ఎంతో పాపులర్ అయ్యారు. అంతకుముందు కూడా ఆమె పలు సీరియళ్లు కార్యక్రమాలు చేసి తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత ఆమెకు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. ‘అఆ’ సినిమాలోని పనిమనిషి పాత్ర ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. స్టార్ మా జెమినీ ఈటీవీ లాంటి చానల్స్ లో ఆమె ఎన్నో విభిన్నమైన కార్యక్రమాలకు యాంకరింగ్ చేశారు. బిగ్బాస్ సీజన్ 1లో హరితేజ ఎంతో అలరించారు. ఆమె ఫైనల్ రౌండ్ దాకా హౌజ్ లో కొనసాగారు. హరితేజ విజేతగా నిలుస్తారని అంతా భావించారు.

కానీ చివరినిమిషంలో అభిమానుల ఓటింగ్ ముఖ్యంగా ఓ ప్రముఖహీరో అభిమానులు కట్టగట్టుకొని మరో సభ్యుడిగా ఓట్లు వేశారు. దీంతో ఆమె టైటిల్ విజేతగా నిలవలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ ఆమె బిగ్బాస్ హౌస్కు వెళ్లాక ఎంతో పాపులారిటీ సంపాదించింది. ఎందరో అభిమానులను తయారు చేసుకున్నది. బిగ్ బాస్ హౌస్ లో ఆమె చెప్పిన బుర్రకథ ప్రేక్షకులను ఎంతో అలరించింది. హరితేజ లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? అంటూ పలువురు ఆమెను మెచ్చుకున్నారు.

ఆ తర్వాత ఆమెకు కొంతకాలం పాటు సినిమా చాన్స్లుకూడా బాగానే వచ్చాయి. కానీ కరోనా లాక్డౌన్తో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం సినిమాలు సీరియల్స్లో ఆమె నటించడం లేదు. అయితే హరితేజ తల్లి కాబోతుండటం తో పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.