వేధింపుల ఆరోపణల్లో 11.1 కోట్ల పరువు నష్టం దావా తేలెదెపుడు?

0

బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పై కథానాయిక పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల కేసులో రిచా చద్దా ఎపిసోడ్స్ తెలిసినదే. ఆయనకు ఫోన్ కాల్ అవేలో అందుబాటులో ఉంటుందని రిచా గురించి ప్రస్థావించింది పాయల్. అనంతరం దానిపై క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ కామెంట్ వేడెక్కించింది. ఇక ఈ ఘటనల తో విసుగెత్తిన రిచా చద్దా.. పాయల్ సహా కమల్ ఆర్.ఖాన్ .. ఇతరులపైనా కోట్లలో పరువు నష్టం దావా వేసారు.

ఈ విషయంపై ముంబై హైకోర్టులో జస్టిస్ అనిల్ మీనన్ ముందు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా స్పష్టపరిచారట. రిచా న్యాయవాదులు వీరేంద్ర తుల్జాపూర్కర్ .. సవీనా బేడి సచార్ నోటీసులు అందించామని పేర్కొన్నా.. పాయల్ ఘోష్ వైపు నుండి ఎవరూ కోర్టుకు హాజరుకాలేదు. అందువల్ల అక్టోబర్ 7 వరకు రూ .11.1 కోట్ల పరువు నష్టం దావాను హైకోర్టు వాయిదా వేసింది. మరోసారి ముద్దాయిలపై పత్రాలను తిరిగి అందించాలని హైకోర్టు కోరింది.

ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య కేసులో తనను లాగారనే ఆరోపిస్తూ రిచా చద్దా … పాయల్ ఘోష్ సహా ఇతరులపై దావాలో శాశ్వత ఉపశమనం కోరుతోంది. ఘోష్ వాదనలు అబద్ధం.. పనికిమాలినవి .. వికృతమైనవి అని చద్దా విమర్శించారు. సినీ పరిశ్రమలో కొన్నేళ్లపాటు శ్రమించి కృషి తో సంపాదించిన కీర్తి ప్రతిష్ఠల్ని మంట కలిపిందని విరుచుకుపడ్డారు ఆమె.

అయితే పాయల్ ఘోష్ వెర్షన్ వేరేగా ఉంది. తాను వెల్లడించిన పేర్లలో హుమా ఖురేషి.. మాహి గిల్ పేర్లు ఉన్న సంగతి విధితమే. అయితే ఎవరినీ కించపరచకూడదనేది తన ఉద్దేశ్యం కానీ అనురాగ్ కశ్యప్ లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పాయల్ ఘోష్ ఆరోపిస్తోంది. పాయల్ ఘోష్ పై రిచా చద్దా చట్టపరమైన చర్యలు తీసుకున్న క్రమంలో తన ప్రియుడు అయిన నటుడు అలీ ఫజల్ రూపంలో సోషల్ మీడియాల్లో మద్దతును పొందింది.