గ్లామర్ ఫీల్డ్ లో హీరోయిన్లపై రూమర్లు సహజం. ఆ హీరోతో ఎఫైర్ ఉందంట? ఈ హీరోతో తిరుగుతుందంట? వంటి కథనాలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అందులోనూ సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చాక ఈ రకమైన కథనాలకు అడ్డు అదుపు లేదు. దీంతో ఇలాంటి కథనాల్ని హీరోయిన్లు కూడా అంతే లైట్ తీసుకుంటారు. కానీ మనసు నొచ్చుకుంటే? మాత్రం తప్పక స్పందిస్తుంటారు. తమ ఆవేదన..మనో వేదనని మీడియా ముందు చెప్పుకుంటారు.
ఇటీవలే ఓ హీరోయిన్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై ఆ నటికి కొంత మంది అండగా నిలిచారు. ఇలాంటి వీడియోలు రిలీజ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. వాస్తవానికి ఈరెస్పాన్స్ చాలా తక్కువనే అనాలి. ఇలాంటలి టెక్నాలజీ బేస్డ్ వీడియోలపై సెలబ్రిటీలంతా పెద్ద ఎత్తున ఉద్యమించాలి. మీటూ తరహాలో దీన్ని సోషల్ మీడియాలో సంచలనం చేయాలి.
కేవలం ఓ ట్వీట్ చేసి వదిలేస్తే సరిపోదు. ప్రభుత్వాలు స్పందించేలా కదం తొక్కాలి. అప్పుడే ఇలాంటి వాటిపై సీరియస్ యాక్షన్ అనేది ఉంటుంది. కానీ ఆ నటి విషయంలో స్పందన తక్కువగానే ఉంది. ఇక ఈ వీడియోపై సదరు నటి ఎంతో బాధపడినట్లు…తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందిన చెప్పుకొచ్చింది. తాజాగా టాలీవుడ్ కి ఓ చెందిన ఓ ఇద్దరు హీరోలు మాత్రం సదరు హీరోయిన్ కి వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఓదార్చారుట.
మనసు పాడు చేసుకోవద్దని..ఆందోళనకు గురి కావొద్దని ధైర్యం చెప్పారట. గతంలో ఆ హీరోలిద్దరు ఆమెతో కలిసి పనిచేసే వారని తెలిసింది. ఆమెని ఓ సహనటిలా కాకుండా మంచి స్నేహితురాలిగా భావించి ఆమెకి ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యక్తిగత ఓదార్పు కొంత వరకూ ఉపశమనాన్ని ఇచ్చేదే. అయితే ఆ పని ఆ ఇద్దరు హీరోలకే పరిమితం కాకుండా ఆమెతో సన్నిహితంగా ఉండే వారంతా కూడా చేస్తే బాగుంటుందని తెలుస్తోంది. ధైర్యం..ఓదార్పు ఇలాంటి సమయంలోనే ఎంతైన అవసరం.