ఆ విషయంలో చైతూ నేను పూర్తి వ్యతిరేకం : సమంత

0

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ అంటే ఠక్కున వినిపించే పేర్లలో ముందు ఉండే జంట నాగచైతన్య సమంత. వీరిద్దరు సుదీర్ఘ కాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. సమంత మరియు నాగచైతన్యలు ఇద్దరు కూడా ఏమాయ చేశావే సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఆ సమయం నుండే ఇద్దరి మద్య ప్రేమ చిగురించింది అనేది టాక్. ఆ విషయం పక్కన పెడితే పెళ్లి తర్వాత వీరిద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో అప్పుడప్పుడు సమంత షేర్ చేసే ఫొటోలు మరియు వీడియోలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు షేర్ చేస్తేనే వారి మద్య అంత ప్రేమ ఉన్నట్లుగా అనిపిస్తే అదే రెగ్యులర్ గా ఇద్దరి జోడీ ఫొటోలు షేర్ అయితే అభిమానులకు కన్నుల వింధు అనడంలో సందేహం లేదు. కాని చైతూకు ఫొటోల షేరింగ్ అస్సలు ఇష్టం ఉండదట. ఈ విషయాన్ని స్వయంగా సమంత చెప్పుకొచ్చింది.

సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమ వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ… ఒక్క విషయంలో మాత్రం మేమిద్దరం పూర్తి వ్యతిరేకంగా ఆలోచిస్తాం. అదేంటీ అంటే సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు మరియు వీడియోలు షేర్ చేసే విషయంలో ఇద్దరం కూడా వేరు వేరు అభిప్రాయాలను కలిగి ఉంటాం. నేను నా వ్యక్తి గత ఫొటోలను ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాను. కాని ఫొటో తీసుకునే సమయంలో పొరపాటున ఫ్రేమ్ లోకి చైతూ వస్తే ఆ ఫొటోలను షేర్ చేసినా ఒప్పుకోడు. ఒక వేళ నేను పోస్ట్ చేయనా అంటూ అడిగినా కూడా వద్దంటాడు. ఆ విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలు కూడా మేము ఒకే అభిప్రాయంను కలిగి ఉంటామంటూ సమంత చెప్పుకొచ్చింది.