ఇంత అందం పెట్టుకుని ఆందోళన ఎందుకో?

0

గోవా బ్యూటీ ఇలియానా పుష్కర కాలంకు పైగా హీరోయిన్ గా వెలుగు వెలుగుతూనే ఉంది. ఈ అమ్మడు టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్ ఇలా ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేయడంతో పాటు వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తుంది. ఇక అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉండేందుకు ఇన్ స్టా గ్రామ్ లో రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూనే ఉంటుంది. తాజాగా అమ్మడు బోట్ పై బికినీలో ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఫొటోతో పాటు తన అందం గురించి ఎప్పుడూ ఆందోళన పడుతున్నట్లుగా పోస్ట్ పెట్టింది.

నా అందం గురించి నాకు ఎప్పుడు ఆందోళనగానే ఉంటుంది. నా హిప్స్.. థైస్.. వ్రిస్ట్.. చెస్ట్ ఇలా అన్ని కూడా ఉండాల్సిన విధంగా కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉన్నాయంటూ తన అందం గురించి తానే ఆవేదన వ్యక్తం చేసింది. నేను ఎప్పుడు పర్ ఫెక్ట్ కాదంటూ ఆమె చెప్పకనే చెప్పింది. అయితే నా ప్రతి భయం.. నా ప్రతి ఆలోచన నన్ను నా సొంతంగా అందంగా కనిపించేలా చేశాయి అంది. ఇంత అందం పెట్టుకుని అందంగా లేను అంటూ తనకు తాను కామెంట్ చేసుకోవడం ఏంటీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ నెటిజన్స్ ఆమెకు మద్దతిస్తున్నారు. అందం లేకుండానే ఇన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఉన్నారా అంటూ మరికొందరు ప్రశ్నించారు.