Templates by BIGtheme NET
Home >> Cinema News >> సెల్ఫీలో గ్లామర్ పాళ్ళు పెంచేసిన గోవా బ్యూటీ..!!

సెల్ఫీలో గ్లామర్ పాళ్ళు పెంచేసిన గోవా బ్యూటీ..!!


గోవా భామ ఇలియానా.. అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు అసలు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నేళ్ల పాటు తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా తెలుగు తెరపై ఇలియానా గ్లామర్ మార్క్ క్రియేట్ చేసుకుంది. 2006లో ‘దేవదాస్’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ తక్కువ టైంలోనే స్టార్ హీరోల సరసన నటించి బాక్సాఫీస్ హిట్స్ అందుకుంది. ఫస్ట్ సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకొని పోకిరి.. జల్సా.. కిక్ లాంటి సినిమాలతో అభిమానులకు డ్రీమ్ గర్ల్ అయిపోయింది. ఇక జులాయి సినిమా హిట్ తర్వాత అడపాదడపా సినిమాలు చేసింది కానీ సరైన అవకాశాలు మాత్రం దక్కలేదు. గ్లామర్ ఫీల్డ్ లో పోటీ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కనిపించిన ఇలియానా.. బర్ఫీ సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించింది.

హిందీలో ఫస్ట్ మూవీతో క్రేజ్ వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే. తెలుగులో ఇలియానా ఎంత గ్లామర్ ఒలికించిందో.. ఇప్పుడు మళ్లీ గ్లామర్ పాత్రలకే అంకితం చేస్తున్నారని వాపోతుందట. ప్రస్తుతం కరోనా టైంలో ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది. తాజాగా ఇల్లు బేబీ పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో అమ్మడు బ్లాక్ అండ్ వైట్ సెల్ఫీలో అందాలను ఆరబోస్తుంది. ఎన్ని సెల్ఫీలు దిగినా ఇలియానా ఎద సోయగాలను చూస్తూ అల్లాడిపోతున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా.. హిందీలో అమ్మడు ఇప్పటివరకు గ్లామర్ షో చేయలేదు. ఇక చేసేదేం లేక వచ్చిన పాత్రలనే చేసుకుంటూ వెళ్తుంది. చివరగా ఇలియానా చేసిన ‘పాగల్ పంతి’ కూడా ప్లాప్ అయింది. ప్రస్తుతం ఇలియానా హిందీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఇటీవలే తన మ్యారేజ్ లైఫ్ కూడా బ్రేక్ అవ్వడంతో మళ్లీ సినిమాల పై ఫోకస్ పెడుతోంది. తాజాగా ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’ సినిమాలో నటిస్తుందట.