ప్రభాస్ ‘ఆదిపురుష్’ లో మరో గుట్టు దాగుందట…!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ”ఆదిపురుష్” అనే స్ట్రెయిట్ హిందీ ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘చెడుపై మంచి సాధించిన విజయం’ అనే థీమ్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. ఈ పోస్టర్ రాముడు విల్లు ఎక్కుపెట్టినట్లుగా.. పది తలల రావణుడు.. గదతో దూసుకొస్తున్న హనుమంతుడు.. మునులు చిత్రాలు.. ఇలా ఇతిహాసగాథ రామాయణాన్ని తలపించేలా డిజైన్ చేయబడి ఉంది. ‘బాహుబలి’ ఇప్పుడు ‘రాముడి’ అవతారం ఎత్తబోతున్నాడని అందరూ అనుకున్నారు. దీనికి తోడు నాగ్ అశ్విన్ ట్వీట్ చేస్తూ.. ‘ప్రభాస్ ని తెరపై రాముడిలా చూడబోతుండడం ఎగ్జైటింగ్ గా ఉంది. గతంలో కొంతమంది నటులు మాత్రమే ఆ పాత్రను చేయగలిగారు’ అని పేర్కొన్నాడు. దీంతో 3-డీ లో రూపొందనున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడని ఫిక్స్ అయ్యారు.

అయితే ‘ఆది పురుష్’లో రాముడిగా ప్రభాస్ నటిస్తున్నాడనే వార్తల్లో వాస్తవం ఉన్నా అందులో మరో గుట్టు దాగుందని తెలుస్తోంది. ‘ఆది పురుష్’ ప్రాజెక్ట్ రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నప్పటికీ ఇది కంప్లీట్ గా ‘రామాయణం’ కాదని.. అందులోనూ ప్రభాస్ ‘రాముడు’గా సినిమాలో కొద్దిసేపు మాత్రమే కనిపించనున్నాడని సమాచారం. అయితే డైరెక్ట్ గా ప్రభాస్ తో రాముడు గెటప్ వేయించడమో లేక కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇంటర్ ఫేజ్ లో ప్రభాస్ ని రాముడుగా చూపించడమో జరుగుతుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా రాముడి కంటే ముందు జరిగిన ఎపిక్ హిస్టరీల నేపథ్యంలో ఉండబోతుందనే న్యూస్ బీ-టౌన్ లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.