పవన్ తో మూవీ కోసం ఆ స్టార్ హీరో రికమెండేషన్ చేస్తున్నాడా…?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎప్పుడూ లేనంత స్పీడ్ గా సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. ఎలక్షన్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవన్.. మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో తన 26వ చిత్రం ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ జరుపుకుంటోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. దీంతోపాటు 27వ సినిమాని క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేయనున్నారు. ఇక 28వ సినిమా కోసం ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ రిపీట్ చేయనున్నారు. హరీష్ శంకర్ తో చేయబోతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 29వ సినిమాని తన స్నేహితుడు నిర్మాణంలో చేయనున్నాడని.. ఇప్పటికే ఓ డైరెక్టర్ పవన్ ని కలిసి స్టోరీ కూడా వినిపించాడని వార్తలు వచ్చాయి.

కాగా పవన్ కళ్యాణ్ కి ఆ డైరెక్టర్ చెప్పింది ఓ మల్టీ స్టారర్ స్టోరీ అని తెలుస్తోంది. అయితే ముందుగా ఈ కథ విన్న ఓ స్టార్ హీరో స్క్రిప్ట్ బాగా నచ్చడంతో పవన్ కళ్యాణ్ ని రికమెండ్ చేశాడట. ఒక హీరోగా తాను నటిస్తూ మరో హీరోగా పవన్ నటించాలనేది ఆ స్టార్ హీరో ఆలోచన. అందులోనూ పవన్ డేట్స్ తీసుకున్న అతని స్నేహితుడు కూడా ఈ స్టార్ హీరోకి క్లోజ్ అవడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించాడట. కాకపోతే పవన్ కళ్యాణ్ లైనప్ చూస్తుంటే ఆ డైరెక్టర్ కి ఇప్పుడప్పుడే అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఈ స్టోరీపై పవన్ పెద్దగా ఆసక్తి కనబరచలేదని సమాచారం. దీంతో పవర్ స్టార్ తో మల్టీస్టారర్ లో యాక్ట్ చేయాలనే ఆ స్టార్ ఆలోచన పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.