సామ్ జామ్ 2వ ఎపిసోడ్ మెగాస్టార్ తో కాదా?

0

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సామ్ జామ్ మొదటి ఎపిసోడ్ కు ఆశించిన స్థాయిలో హైప్ రాలేదు. దాంతో రెండవ ఎపిసోడ్ చాలా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో చిరంజీవిని రంగంలోకి దించారు. ఇటీవలే చిరంజీవి మరియు సమంతలు సామ్ జామ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిరంజీవి లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెల్సిందే. చిరంజీవి సామ్ జామ్ ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో తదుపరి ఎపిసోడ్ రానా మరియు నాగ్ అశ్విన్ అంటూ ఆహా అధికారికంగా ప్రకటించింది.

సమంత సామ్ జామ్ లో రానా మరియు నాగ్ అశ్విన్ లు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. దాంతో అతి త్వరలోనే ఆహాలో వీరి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వబోతుంది. మరి చిరంజీవితో చేసిన ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం క్లారిటీ లేదు. సమంత.. చిరంజీవిల మద్య మాటలు ఎలా ఉంటాయి.. మెగాస్టార్ చిరంజీవిని సమంత ఎలా డీల్ చేశారు అనేది చూడాలనుకుంటే అనూహ్యంగా రానా మరియు నాగ్ అశ్విన్ ల ను తీసుకు రావడం చర్చనీయాంశంగా ఉంది. ఏదైనా ప్రత్యేక సందర్బంలో చిరంజీవి సామ్ జామ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందంటున్నారు.