రాజశేఖర్ ఆరోగ్యం చాలా మెరుగయ్యింది : జీవిత

0

హీరో రాజశేఖర్ మరియు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. మొదట ఆయన కూతుర్లు ఇద్దరు శివాని మరియు శివాత్మికలు కరోనాను జయించారు. ఆ తర్వాత జీవిత కూడా కరోనా బారి నుడం బయడ పడ్డారు. కాని రాజశేఖర్ మాత్రం కాస్త క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నాడు అంటూ స్వయంగా కుటుంబ సభ్యులు మరియు సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి కూడా ప్రకటించింది. ఆయన ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులు మరియు ఆసుపత్రి వర్గాల వారు వెళ్లడిస్తూ పుకార్లు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరోసారి రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషయమై జీవిత మీడియా ముందుకు వచ్చారు. ఆమె మాట్లాడుతూ.. రాజశేఖర్ గారి ఆరోగ్యం గతంతో పోల్చితే చాలా బెటర్ అయ్యింది. మొదట ఆయన చాలా క్రిటికల్ స్టేజీకి వెళ్లారు. మేము ఆ సమయంలో చాలా ఆందోళనకు గురి అయ్యాం. డాక్టర్లు ఆయన్ను చాలా శ్రద్దగా ట్రీట్ చేయడం వల్లే ఇప్పుడు ఆక్సీజన్ అందించకుండా స్వయంగా ఆయనే ఊపిరి తీసుకుంటున్నారు.

వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆయనకు ఎప్పుడు కూడా వెంటిలేటర్ పెట్టలేదు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో రాజశేఖర్ గారు డిశ్చార్జ్ అవుతారనే నమ్మకంను జీవిత వెళ్లడించారు. రాజశేఖర్ గారి ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్పారు.