Templates by BIGtheme NET
Home >> Cinema News >> విజయ్ ఆంటోనీ జ్వాల పూర్తి

విజయ్ ఆంటోనీ జ్వాల పూర్తి


తెలుగు ప్రేక్షకులకు ‘బిచ్చగాడు’ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలతో దగ్గర అయిన విజయ్ ఆంటోనీ తన ప్రతి తమిళ సినిమాను టాలీవుడ్ లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఈయన నటించిన సినిమాను తెలుగులో ‘జ్వాల’గా విడుదల చేయబోతున్నారు. నవీన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రను అరుణ్ విజయ్ పోషించబోతున్నాడు. తమిళంలో అగ్ని సిరగుగల్ గా రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో జ్వాల గా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఫస్ట్ లుక్ లో విజయ్ ఆంటోనీ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోల్ కత్తా షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. దాంతో సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని యూనిట్ సభ్యులు ప్రకటించారు. నటరాజన్ సంకరన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించాడు. బిచ్చగాడు తర్వాత విజయ్ కి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రాలేదు. ముఖ్యంగా తెలుగులో ఈయన సక్సెస్ లేదు కనుక జ్వాలతో ఆకట్టుకుంటాడా అనేది చూడాలి.