వాళ్లిద్దరు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు

0

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా 2005 సంవత్సరంలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అయిన చేతన్ ఆనంద్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఇద్దరి మద్య విభేదాల కారణంగా చాలా తక్కువ సమయంలోనే విడిపోయారు. 2011లో వీరిద్దరికి అధికారికంగా విడాకులు వచ్చాయి. అప్పటి నుండి సింగిల్ గా జీవిస్తున్న గుత్తాకు కొన్నాళ్ల క్రితం తమిళ నటుడు విష్ణు విశాల్ తో పరిచయం అది ప్రేమగా మారడం జరిగింది. విష్ణు విశాల్ కూడా 2010 సంవత్సరంలో రజినీ నటరాజ్ ను వివాహం చేసుకుని 2018 సంవత్సరంలో ఆమెతో విడాకులు తీసుకున్నాడు.

ఇద్దరు కూడా వారి వారి భాగస్వామి నుండి విడాకులు తీసుకున్నారు. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. పెద్దగా ఎవరికి చెప్పకుండా పిలవకుండా సింపుల్ గా ఉంగరాలు మార్చేసుకున్నారు. త్వరలోనే వీరి వివాహం జరుగబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. గుత్తా జ్వాలా పుట్టిన రోజు సందర్బంగా విష్ణు విశాల్ సోషల్ మీడియాలో.. హ్యాపీ బర్త్ డే గుత్తా జ్వాల. ఇద్దరం కూడా కొత్త ప్రయాణం మొదలు పెడుదాం. మంచి భవిష్యత్తు కోసం మన కుటుంబాల కోసం మన స్నేహితుల కోసం ఇద్దరం కూడా పాజిటివ్ గా ఉందాం. ఇందుకు గాను మీ అందరి ఆశీర్వాదం కావాలంటూ తమ బందంను విశాల్ రివీల్ చేశాడు. అతడి ట్వీట్ ను జ్వాల రీట్వీట్ చేసింది. త్వరలో వీరిద్దరు పెళ్లి పీఠలు కూడా ఎక్కే అవకాశం ఉందంటున్నారు.