కాజల్ పెళ్లి కూతురాయెనే

0

అందాల చందమామ పెళ్లికూతురాయెను. తాను వలచిన గౌతమ్ కిచ్లుని పెళ్లాడెను… ప్రస్తుతం ఏ నోట విన్నా ఇదే మాట. అభిమానుల ఆనందానికి అయితే అవధులే లేవు. తాజాగా కాజల్ వధువు గెటప్ ఫోటో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. తన అభిమానులకు చూపించడానికి మొదటి చిత్రాన్ని కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ‘తుఫాను ముందు ప్రశాంతత’లా దుమారం రేపింది ఈ ఫోటో.

పెళ్లి నుండి తన మొదటి చిత్రంలో వధువులా అందంగా కనిపించింది కాజల్ అగర్వాల్. ఈ జంట వివాహం ముంబైలో శుక్రవారం సాయంత్రం జరగనుందన్న సంగతి విధితమే. ఈ నెల ప్రారంభంలో ఈ జంట తమ వివాహాన్ని ప్రకటించారు.

కాజల్ వధువుగా తన మొదటి చిత్రంలో ముగ్ధమనోహరినే తలపించింది. పెళ్లి ఆభరణాలన్నీ ధరించి పర్ఫెక్ట్ హెయిర్ మేకప్ లో ఆమె లుక్ వ్వావ్ అంటూ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. తెల్లటి చీరలో సిగ్గుపడే పెళ్లికూతురులా తీక్షణంగా ఏదో ఆలోచిస్తూ కనిపించింది. ఆమె జుట్టును సొగసైన గులాబీ బన్నుతో అలంకరించిన తీరు ఆకట్టుకుంది. “తుఫాను #kajgautkitched ముందు శాంతించు“ అన్నశీర్షిక వెనక మీనింగ్ ఏమిటో కాజలే చెప్పాలి మరి. ఈ ఫోటో బయటికి రాగానే లక్ష్మీ మంచు.. తమన్నా.. రకుల్ ప్రీత్ సహా పలువురు కోస్టార్లు స్పందించి ఆనందం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు తెలిపారు.

కాజల్ కుటుంబం శుక్రవారం తెల్లవారుజామున వివాహ వేదిక వద్దకు వెళ్లారు. ఆమె తన తల్లితో కలిసి తన ఇంటి బయట ఫోటోల కోసం పోజులిచ్చింది. ధోల్ నృత్యం చేస్తున్నప్పుడు కాజల్ అలాగే తన సోదరి అతిథులను స్వాగతించే వీడియో రిలీజైంది. కాజల్ అక్క కూడా తన కొడుకుతో చేతుల్లో డ్యాన్స్ చేయడం కనిపించింది. నేటి ఉదయం కూడా కాజల్ తన హల్ది వేడుక నుండి సెలబ్రేషన్ ఫోటోల్ని పంచుకున్నారు. వివాహానికి ముందు వేడుకల సందర్భంగా కాజల్ పసుపు పూసుకుని అందమైన వర్చస్సుతో మెరిసిపోయింది.