రొమాంటిక్ మూడ్ లో కాజల్ కిచ్లు

0

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పది రోజుల క్రితం వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఇటీవలే కొత్త జంట మాళ్దీవులకు హనీమూన్ కు వెళ్లారు. హనీమూన్ కు వెళ్లిన ఈ జంట అక్కడ సముద్రపు అందాలను ఆస్వాదిస్తున్నారు. ఆ ఫొటోలను రెగ్యులర్ గా ఇద్దరు కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. కాజల్ తాజాగా ఈ ఫొటోను షేర్ చేసంది. భర్తతో కాజల్ రొమాంటిక్ ఫోజ్ ఇచ్చింది. ఈ ఫొటోకు సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా కామెంట్స్ వస్తున్నాయి.

కాజల్ అగర్వాల్ అభిమానులు ఈ ఫొటోకు విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. చందమామ బ్యూటీకి గౌతమ్ కిచ్లు అంకుల్ లా ఉన్నాడే అంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి జంట పెళ్లి సందర్బంగా చూడముచ్చటగా ఉన్నా కూడా ఈ ఫొటోలో మాత్రం అన్ ఫెయిర్ అన్నట్లుగా ఉన్నారు అనిపిస్తుందని అంటున్నారు. హనీమూన్ కపుల్ ఎంచక్క ఎంజాయ్ చేయకుండా ఎందుకు ఇలా ఫొటో షూట్ ల పేరుతో టైమ్ వేస్ట్ చేస్తున్నారు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు మరెన్ని ఇలాంటి కళా ఖండాలు చూడాల్సి వస్తుందో అంటూ అభిమానులు ఫన్నీ ఈమోజీలు మీమ్స్ షేర్ చేస్తున్నారు.