కళ్యాణి ప్రియదర్శన్ క్యూట్ ‘ఓనం’ లుక్

0

ప్రముఖ ఫిల్మ్ మేకర్ ప్రియదర్శన్ నట వారసురాలిగా ‘హలో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ ఆ తర్వాత చిత్రలహరి మరియు రణరంగం సినిమాలు చేసింది. తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ లు మరియు ఆఫర్లు రాకపోవడంతో తమిళం మరియు మలయాళంకు షిఫ్ట్ అయ్యింది. అక్కడ సినిమాలు చేస్తూ మెల్ల మెల్లగా స్టార్ డం దక్కించుకుంటుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ ఫాలోవర్స్ ను అలరిస్తూ ఉండే ఈ అమ్మడు తాజాగా ఓనం స్పెషల్ ఫొటోలను షేర్ చేసింది.

కేరళ వారి సాంప్రదాయ పండుగ అయిన ఓనంను ఈమె తన కుటుంబం సభ్యలతో జరుపుకుంది. ఈ సందర్బంగా కళ్యాణి కేరళ సాంప్రదాయ చీర కట్టుకోవడంతో పాటు అక్కడి సాంప్రదాయ వంటలు చేసి పెట్టింది. మొదటి సారి ఓనం లంచ్ ను ఏర్పాటు చేశానంటూ చెప్పుకొచ్చింది. మలయాళంలో ఈమె సినిమాలు చేస్తోంది. అక్కడ ఈమెకు ఉన్న అభిమానుల కోసం ఇలా ఓనం స్పెషల్ గా రెడీ అయ్యి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఓనం లుక్ లో కళ్యాణి లుక్ చాలా క్యూట్ గా ఉందనే కామెంట్స్ దక్కాయి. రెండు గంటల్లో లక్షన్నర లైక్స్ కళ్యాణి క్యూట్ ఓనం లుక్ కు వచ్చాయి.