కంచెరపాలెం టు ఎంపైర్ స్టేట్ ‘సుమతి’

0

కేరాఫ్ కంచరపాలెం వంటి ఒక చిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు వెంకటేష్ మహా ఇటీవల ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అసే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈసారి కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. రామ్ చరణ్ నుండి కూడా సినిమాకు ప్రశంసలు దక్కాయి. ఓటీటీలో విడుదలైన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రంకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో మరో ప్రాజెక్ట్ ను వెంకటేష్ మహా ప్రకటించాడు.

మొదటి రెండు సినిమాలను పల్లెటూరు నేపథ్యంలో సింపుల్ గా తెరకెక్కించిన దర్శకుడు వెంకటేష్ మహా తన మూడవ సినిమాను అమెరికా నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో అర్థం అవుతుంది. ‘సు మతి’ అనే టైటిల్ తో ఈసారి వెంకటేష్ సినిమా రూపొందబోతుంది. కేరాఫ్ కంచరపాలెం చిత్రంలో వేశ్య పాత్రలో నటించడంతో పాటు ఆ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించిన ప్రవీణ పరుచూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

న్యూయార్క్ లోని ప్రముఖ ఎంపైర్ స్టేట్ ముందు ఒక వృద్ద మహిళ నిల్చుని ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తుంది. ఒక తెలుగు వృద్ద మహిళ ఎంపైర్ స్టేట్ కు వెళ్లడం అక్కడ ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఉంటుందని ఫస్ట్ లుక్ తోనే అర్థం అవుతుంది. ఈ సినిమాలో ఎక్కువ శాతం యూఎస్ లో చిత్రీకరించే అవకాశం ఉంది. ఈ చిత్రంను కూడా స్పీడ్ గా పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.