‘కపటధారి’ చరిత్రలో నిలిచేనేమో

0

కరోనా కారణంగా దాదాపుగా 9 నెలలు మూతబడి ఉన్న థియేటర్లు ఎట్టకేలకు ఓపెన్ కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఓపెన్ కు మార్గ దర్శకాలు ఇచ్చి నెల రోజులు దాటినా కూడా ఎక్కువ శాతం థియేటర్లు ఓపెన్ కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు థియేటర్ల పునః ప్రారంభంకు ప్రభుత్వం ఓకే చెప్పడంతో సినిమాల విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్రిస్మస్ కానుకగా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ నెలలో కొత్త సినిమాలు ఏవీ కూడా విడుదల అయ్యే అకవాశం లేదని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

వచ్చే నెలలో కాస్త గుర్తింపు ఉన్న రెండుమూడు సినిమాలు అయినా విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా సుమంత్ నటించిన కపటధారి సినిమా ఒకటి ఉంటుంది. ఇప్పటికే క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో అయినా నడిపేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటన రావడంతో 50 శాతం ఆక్యుపెన్సీలో అయినా వచ్చేందుకు తాము సిద్దం అంటూ కపటధారి యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. సుదీర్ఘ విరామం తర్వాత రాబోతున్న సినిమా అవ్వడంతో కపటధారి సినిమా చరిత్రలో నిలిచే అవకాశం ఉంది. సక్సెస్ లు లేని సుమంత్ ఈ సినిమాతో సక్సెస్ కొట్టి చరిత్రలో నిలిచేనో చూడాలి.