కీర్తి సురేష్ దండుపాళ్యం గెటప్

0

దండుపాళ్యం అనగానే కరడుగట్టిన నేరస్తులు గుర్తుకు వస్తారు. ఇప్పుడు అదే గెటప్ లో కీర్తి సురేష్ తన కొత్త సినిమా సాని కాయిదం లో కనిపించబోతుంది. నేరస్తురాలో లేదా మరేంటో కాని గెటప్ మాత్రం అలాగే ఉంది. ఇటీవలే మిస్ ఇండియాలో మోస్ట్ బ్యూటీ ఫుల్ గా కనిపించిన కీర్తి సురేష్ ఉన్నట్లుండి ఈ లుక్ లో కనిపించింది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా దర్శకత్వం అందిస్తున్నాడు. సెల్వ రాఘవన్ కూడా ఈ పోస్టర్ లో ఉండటంతో తమిళ ప్రేక్షకులతో పాటు అంతా కూడా వావ్ అంటున్నారు. తలకు గాయాలతో కీర్తి సురేష్ డీ గ్లామర్ గా చీర కట్టులో కాళ్లపై కూర్చుని ముందు ఆయుదాలు ఉండటంతో ఇదేదో క్రైమ్ డ్రామా మూవీ అయ్యి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈమద్య కాలంలో కీర్తి సురేష్ ఒక వైపు హీరోలకు జోడీగా కమర్షియల్ రొమాంటిక్ పాత్రల్లో కనిపిస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఈ అమ్మడు చేస్తున్న సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా అలా అలా ముందుకు సాగుతోంది. ఒక వైపు సర్కారు వారి పాట లో మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ తో కమర్షియల్ రోల్ లో కనిపించబోతున్న ఈ అమ్మడు సాని కాయిదం సినిమాలో దండుపాళ్యం తరహా పాత్రలో కనిపించబోతుండటం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.