ఓటీటీ ద్వారా దసరాకు కీర్తిసురేష్

0

కరోనా కారణంగా ఆరు నెలలుగా మూత బడ్డ థియేటర్లకు ఇంకా అన్ లాక్ చేసే ఉద్దేశ్యంలో కేంద్రం లేనట్లుగా తేలిపోయింది. సెప్టెంబర్ నుండి ఖచ్చితంగా థియేటర్లు ఓపెన్ అవుతాయని అంతా భావించారు. కాని మరో నెల రోజులు ఆగాల్సిందే అంటూ కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ నుండి అయినా థియేటర్లు ఓపెన్ అవుతాయా అంటే అనుమానమే అంటున్నారు మరికొందరు. ఇలాంటి సమయంలో వరుసగా సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే కీర్తి సురేష్ ‘పెంగ్విన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలో ‘మిస్ ఇండియా’ కూడా ఓటీటీ విడుదలకు రెడీ అవుతోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి ఈ సినిమాను కొనుగోలు చేయడం జరిగింది. ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం మంచి టైం సెట్ చేశారు. అక్టోబర్ లో మొదటి వారంలో లేదా రెండవ వారంలో దసరా పండుగ కానుకగా ఈ సినిమాను ప్రీమియర్ చేయాలని నిర్ణయించారట. మరో వారం లేదా రెండు వారాల్లో సినిమా పబ్లిసిటీని మొదలు పెట్టబోతున్నారు. పెంగ్విన్ సినిమా ఓటీటీ ద్వారా విడుదల చేయగా నిరాశ పర్చగా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఉండి ప్రేక్షకులు దసరా పండుగ స్పెషల్ గా నిలుస్తుందా అనేది చూడాలి. ఈ సినిమాతో నరేంద్ర నాథ్ దర్శకుడిగా మారగా మహేష్ కోనేరు నిర్మించాడు. మహానటి చిత్రం తర్వాత ఆల్ ఇండియా స్థాయిలో ఈమెకు క్రేజ్ దక్కింది. కనుక మిస్ ఇండియాను సౌత్ లో అన్ని భాషలతో పాటు హిందీలోను డబ్ చేయబోతున్నారు.