తారక్ తో జాక్ పాట్.. డెబ్యూ బ్యూటీ ఇక అంతేగా!

0

యంగ్ యమ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోవాలని సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. అయితే మహమ్మారీ ఊహించని బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఏడెనిమిది నెలలుగా ఇండస్ట్రీకి చెక్ పెట్టేసిన కరోనా.. ఇప్పుడిప్పుడే రిలీఫ్ నిస్తోంది. వరుసగా షూటింగులు ప్రారంభమవుతున్నాయి.

అదే క్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో తన సినిమాని పరుగులు పెట్టించేందుకు ఎన్టీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మాయావి ప్రీప్రొడక్షన్ పూర్తి చేస్తున్నారు. అలాగే ఆర్టిస్టుల ఎంపిక కూడా సాగుతోంది. తారక్ సరసన కీర్తి సురేష్ ని కథానాయికగా ఎంపిక చేశారని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని ప్రచారమైంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో రొమాంటిక్ ఫేం కేతిక శర్మ కథానాయికగా నటించనుందని తెలుస్తోంది. ఇటీవలే కేతిక త్రివిక్రమ్ ని కలిసిందట. ఆ క్రమంలోనే ఆయన మాటిచ్చేశారని తెలుస్తోంది. అయితే కీర్తి స్థానంలో ఈ భామను ఎంపిక చేశారా లేక రెండో నాయికగానా? అన్నది తేలాల్సి ఉంది. నటించిన తొలి సినిమాతోనే కేతికకు హాట్ గాళ్ అన్న ముద్ర పడిపోయింది. ఆకాష్ పూరితో బీచ్ లో రొమాన్స్ చేస్తున్న కేతిక ఫోటోలు యువతరంలో ఆ తరహా ముద్రను వేశాయి. కాబట్టి తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ స్పెషల్ పాత్రను త్రివిక్రమ్ డిజైన్ చేస్తారని చర్చ సాగుతోంది. అయినా తారక్ సరసన ఎలాంటి ఆఫర్ దక్కినా అది జాక్ పాట్ కిందే లెక్క. అందునా త్రివిక్రమ్ లాంటి ప్రతిభావంతుడి చేతిలో పడితే ఇక అంతేగా! అంటూ అంతా ఒకటే గుసగుసలాడేస్తున్నారు.