ఆదిపురుష్ 3డి: కియారానే సీత.. మహానటికి నో ఛాన్స్!!

0

బాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ ఫేవరేట్ గా వెలిగిపోతోంది కియరా. `లస్ట్ స్టోరీస్`తో ఈ భామ పేరు దేశం మొత్తం మార్మోగింది. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనూ మంచి క్రేజ్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ టాప్ హీరోయిన్ గా స్టార్ డమ్ ని దక్కించుకున్న కియారా `భరత్ అనే నేను` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఆ మూవీ హిట్ కావడంతో టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించి మరో ఆఫర్ ని దక్కించుకుంది. 2019లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం `వినయ విధేయ రామ`. ఈ సినిమాలో కియారా హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్ లో కియారాకు ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగిపోయింది. ఉత్తరాదితో పాటు దక్షిణాదిని కూడా తన గ్రిప్ లో పెట్టుకున్న కియారాకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

తాజాగా `ఆస్క్ మీ ఎనీథింగ్` అనే సెషన్ ని నిర్వహించింది. ఈ సెషన్ లో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు కియారా ఆసక్తికర సమాధానాలు చెప్పింది. ఇదే సందర్భంలో ఓ అభిమాని మరిన్ని సౌత్ చిత్రాల్లో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం` అని అడిగితే స్మార్ట్ గా సమాధానం చెప్పింది. `త్వరలోనే మీరు చూస్తారని` స్మార్ట్ గా తెలుగులో తను చేయబోతున్నకొత్త సినిమా ప్రాజెక్ట్ ఏంటో చెప్పకుండానే తెలుగు సినిమా చేస్తున్నానని హింట్ ఇచ్చేసింది. ప్రభాస్ నటిస్తున్న `ఆదిపురుష్` చిత్రంలో సీత పాత్ర కోసం కియారాని చిత్ర బృందం సంప్రదిస్తున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కియారా ఇండైరెక్ట్ గా తెలుగు సినిమా చేయబోతున్నానంటూ హింట్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ హింట్ చూస్తుంటే మహానటి కీర్తి సురేష్ కి ఆ ఛాన్స్ మిస్సయినట్టేనని అంతా భావిస్తున్నారు.