Templates by BIGtheme NET
Home >> Cinema News >> కొరటాలకి మళ్లీ మొదలైన అప్డేట్‌ తలనొప్పి

కొరటాలకి మళ్లీ మొదలైన అప్డేట్‌ తలనొప్పి

స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే దర్శకులకు, నిర్మాణ సంస్థలకు సోషల్‌ మీడియాలో ఏదో ఒక సమయలో తలనొప్పి తప్పడం లేదు. ప్రభాస్ తో సినిమాలు చేసిన యూవీ మేకర్స్ వారిని అభిమానులు అప్డేట్‌ ఇవ్వడం లేదు అంటూ ఏ స్థాయిలో ట్రోల్స్ చేశారో చూశాం. ఏకంగా యూవీ క్రియేషన్స్ ను బ్యాన్‌ చేయాలి అంటూ సోషల్‌ మీడియా ద్వారా ట్రెండ్‌ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు దేవర సినిమా మేకర్స్ కూడా అదే సమస్య ను ఎదుర్కొంటున్నారు. దేవర షూటింగ్‌ ప్రారంభం అయిన సమయంలోనే అప్డేట్‌ అప్డేట్‌ అంటూ ఫ్యాన్స్ ఆందోళన చేశారు. దాంతో ఎన్టీఆర్‌ స్వయంగా ఒక సినిమా వేడుకలో పదే పదే అప్డేట్‌ అంటే ఎలా.. ఏదైనా అప్డేట్‌ ఉంటే కచ్చితంగా మా ఇంట్లో వారికంటే ముందు మీకే చూపిస్తాము అన్నాడు.

మధ్యలో సినిమా రెండు పార్ట్‌ లుగా రాబోతుందని ప్రకటన రావడంతో పాటు, ఎన్టీఆర్ కొత్త పోస్టర్‌, జాన్వీ కపూర్‌ ఇలా కొన్ని పోస్టర్ లను విడుదల చేయడం జరిగింది. అయితే గడచిన కొన్ని వారాలుగా దేవర అప్డేట్స్ ఏమీ లేకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా మళ్లీ అప్డేట్‌ అంటూ ట్రెండ్‌ చేయడం మొదలు పెట్టారు.

#WeWantDevaraUpdate అనే హ్యాష్ ట్యాగ్‌ ను ఎక్స్ లో ఎన్టీఆర్‌ అభిమానులు తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. వారాలుగా ఎదురు చూస్తున్నా కూడా ఎలాంటి అప్డేట్‌ ఇవ్వడం లేదు అంటూ దర్శకుడు కొరటాల శివ పై కొందరు తీవ్రమైన విమర్శలు చేస్తూ ఎక్స్ లో పోస్ట్‌ లు పెడుతూ ఉన్నారు. మొత్తానికి దేవర అప్‌డేట్ కావాలంటూ చాలా మంది డిమాండ్‌ చేస్తున్నారు.

దేవర సినిమా ఎలాగూ వచ్చే ఏడాది ఏప్రిల్‌ లో సమ్మర్ కానుకగా విడుదల అవ్వబోతుంది. కనుక టీజర్‌ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేదు. కనుక టీజర్‌ ను విడుదల చేసి ఫిబ్రవరి నుంచి ఒకొక్క పాట చొప్పున వదిలితే బాగుంటుంది అనేది ఫ్యాన్స్ అభిప్రాయం.

క్రిస్మస్ కానుకగా లేదంటే కొత్త సంవత్సరం కానుకగా దేవర టీజర్‌ విడుదల చేయాల్సిందే అంటూ చాలా మంది ఫ్యాన్స్ పట్టుబడుతున్నారు. కానీ మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. గతంలో మాదిరిగా ఎన్టీఆర్ మళ్లీ సీరియస్ అయ్యేంతగా ఫ్యాన్స్‌ #WeWantDevaraUpdate హ్యాష్ ట్యాగ్‌ నెగిటివ్ ట్రెండ్‌ చేస్తారేమో చూడాలి.

Share via
Copy link