కొరటాల వెనక సీక్రెట్ కామ్రేడ్ గూడుపుఠాని..!

0

కమర్షియల్ హంగులు జోడిస్తూనే సామాజిక సందేశంతో సినిమాలు తీయడం కొందరికే చెల్లింది. ఆ కోవకే చెందుతారు శంకర్. అతడి తర్వాత మురుగదాస్ కూడా ఆ తరహా ప్రయత్నం చేశారు. ఇటు టాలీవుడ్ వైపు వస్తే కొరటాల శివ ఈ తరహా సినిమాలకు ప్రసిద్ధి అన్న టాక్ కూడా వినిపించింది. అతడు తెరకెక్కించిన శ్రీమంతుడు- భరత్ అనే నేను- జనతా గ్యారేజ్ లాంటి చిత్రాల్లో సామాజిక సందేశం అనేది అండర్ కరెంట్ టాపిక్ గా ఉంటుంది.

`ఆచార్య` ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూశాక అందులో సామాజిక సందేశం ఏమై ఉంటుంది? అన్న చర్చా మొదలైంది. పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి `ధర్మస్థలి` ప్రజల కోసం ధర్మానికి కామ్రేడ్ గా నిలబడి ఉన్నారు. సమాజంలో దుష్ట శక్తులకు వ్యతిరేకంగా కామ్రేడ్ ఎలా పోరాడుతాడో ఈ పోస్టర్ మనకు చెబుతోంది.

ఇదే కాదు.. తదుపరి బన్నితో #AA21 థీమ్ పోస్టర్ విడుదలైంది. అందులోనూ నదికి అవతలి వైపు జరుగుతున్న ఏదో గూడుపుటానీ గురించి ఆందోళన చెందుతుంటే.. ఈ తీరం ఎండిన నేలతో పొడిగా కనిపించింది. అయితే ఇంత గొప్ప భావజాలం అభివృద్ధి చెందాలంటే దాని వెనక బలమైన నేపథ్యం కూడా ఉండి తీరాలి. కొరటాల తన తల్లి ఒక కఠినమైన కమ్యూనిస్ట్!! అని ఓ ఇంటర్వ్యూలలో వెల్లడించారు. ఇప్పుడు చిరుని కామ్రేడ్ గా.. అలాగే బన్నిని యూత్ లీడర్ గా చూపించబోతున్నారంటే దాని వెనక కూడా ఈ నేపథ్యంలో విప్లవ భావజాలమే కారణం.