Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘ఉప్పెన’ బ్యూటీకి ఇక్కడ నో ఛాన్స్, అక్కడ హోప్స్‌

‘ఉప్పెన’ బ్యూటీకి ఇక్కడ నో ఛాన్స్, అక్కడ హోప్స్‌


చిన్న వయసులోనే సూపర్ హిట్స్ ను, అట్టర్ ఫ్లాప్స్ చవి చూసిన.. చవి చూస్తున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. 18 ఏళ్లు కూడా నిండా లేని వయసు లో ఉప్పెన సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న కృతి శెట్టి ఆ తర్వాత వరుసగా మంచి విజయాలను సొంతం చేసుకుని టాలీవుడ్ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్స్ జాబితాలో చేరిన విషయం తెల్సిందే.

ఏడాది తిరిగే లోపు కృతి శెట్టి కెరీర్ మొత్తం తల కిందులు అయింది. వరుసగా కృతి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో ఈ అమ్మడికి టాలీవుడ్‌ లో ఆఫర్లే కరువయ్యాయి. నాగ చైతన్య తో నటించిన కస్టడీ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్న కృతికి నిరాశే మిగలడంతో ఇక ఆ తెలుగు సినిమాల్లో ఆఫర్లు దక్కడం లేదు. ఒకటి రెండు చర్చల దశలో ఉన్నాయి కానీ అవి ఎంత వరకు ఫైనల్ అయ్యేది క్లారిటీ లేదు.

హీరోయిన్‌ గా ప్రస్తుతం తమిళంలో ఒక సినిమాను కార్తీ తో కలిసి కృతి శెట్టి నటిస్తోంది. ఆ మధ్య సూర్య తో బాల దర్శకత్వం లో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ సినిమా పోయినా కూడా కార్తీ తో నటించే అవకాశం రావడంతో కెరీర్ పై ఈ అమ్మడు హోప్స్‌ పెట్టుకుంది. తెలుగు లో పట్టించుకోకున్నా కోలీవుడ్‌ పై నమ్మకం పెట్టుకుంది. కార్తీ హీరోగా సూపర్‌ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న నలన్ కుమారస్వామి దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాకు ఉన్న బజ్ నేపథ్యం లో తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళ్ లో ప్రస్తుతం చేస్తున్న కార్తీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే అక్కడ కృతి శెట్టి బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ వరుసగా సినిమాలు చేయడం ద్వారా మళ్లీ టాలీవుడ్‌ లో కూడా ఉప్పెన బ్యూటీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక తెలుగు లో ఛాన్స్ లు లేకున్నా కోలీవుడ్‌ పైనే కృతి హోప్స్ పెట్టుకుంది.