‘ఉప్పెన’ బ్యూటీ చరణ్ కు సోపేస్తుందా?

0

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల పరిచయం కాబోతున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమా ఇంకా విడుదల కానే కాలేదు. ఈ అమ్మడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ అమ్మడికి దక్కిన క్రేజ్ నేపథ్యంలో ఈమె మొదటి సినిమా విడుదల కాకుండానే మరో రెండు మూడు సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. వచ్చే ఏడాది ఈ అమ్మడు ఒకేసారి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు టాలీవుడ్ లో రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. ఆ మాటలు వింటే ఈ అమ్మడికి రామ్ చరణ్ తో నటించాలనే ఆసక్తి ఉన్నట్లుగా ఉంది అనిపిస్తుంది. తెలుగులో ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే యంగ్ స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంటుంది. వచ్చే ఏడాదిలో రెండు మూడు సక్సెస్ లు పడితే ఎన్టీఆర్ ఏంటీ మహేష్ బాబు నుండి కూడా ఈమెకు పిలుపు వచ్చే అవకాశం లేకపోలేదు అంటూ అభిమానులు మరియు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చరణ్ దృష్టిలో పడేందుకు ఈమె చేసిన ప్రయత్నం ఎంత వరకు వర్కౌట్ అయ్యేనో చూడాలి.