Templates by BIGtheme NET
Home >> Cinema News >> `గని` ట్రైలర్ : అమ్మకు నిజం తెలిసే రోజే వస్తే..

`గని` ట్రైలర్ : అమ్మకు నిజం తెలిసే రోజే వస్తే..


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చాలా హోప్స్ పెట్టుకున్న చిత్రం `గని`. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించారు. బాక్సర్ గా నేషనల్ ఛాంపియన్ షిప్ ని సొంతం చేసుకోవాలన్న ఓ యువకుడి కల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ కంపనీ రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్ పై సిద్దు ముద్దతో కలిసి అల్లు బాబి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. గత కొన్ని రోజులుగా రిలీజ్ విషయంలో సందిగ్ధత నెలకొన్న ఈ మూవీ ఎట్టకేలకు ఏప్రిల్ 8న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ ని చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. `గని ఇంక లైఫ్ లో బాక్సింగ్ ఆడననిప్రామిస్ చెయ్.. అంటే తల్లి పాత్రలో నటించిన నదియా చెబుతున్న డైలాగ్స్ తో ట్రైలర్ మొదలైంది. అయితే తల్లికి తెలియకుండా గని తన బాక్సింగ్ గోల్ ని కంటిన్యూ చేస్తుంటాడు.

`ఒక వేళ అమ్మకు నిజం తెలిసే రోజే వస్తే.. అది నేను నేషనల్ ఛాంపియన్ అయిన రోజవ్వాలి.. అదే నా గోల్ ..` అంటూ వరుణ్ చెబుతున్న డైలాగ్ లు… గని చెప్పలేదా మీకూ .. నేను తన లవర్ అని… హీరోయిన్ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకోవడం.. ప్రపంచం చూస్తుంది డాడ్ గెలవాలి…అని నవీన్ చంద్ర… నాకు గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు… అని వరుణ్ తేజ్ అనడం.. ఈ క్రమంలో నవీన్ చంద్ర వరుణ్ తేజ్ ల మధ్య వార్ జరగడం… అయితే బట్ ఆ గెలుపుకి బ్రాండ్ అంబాసిడర్ నేను అని సునీల్ శెట్టి.. ఉపేంద్రల ఎంట్రీ.. బాక్సింగ్ రింగ్ లో వరుణ్ ప్రత్యర్థి పంచ్ లు కు నేలకొరగడం.. నీ కంటే ముందు నేషనల్స్ కి చాలా మంది వెళ్లారు కానీ ఏమీ పీకలేకపోయారని బ్రహ్మాజీ హేళనగా మాట్లాడటం..

బాక్సింగ్ రింగ్ నుంచి బయటికి వచ్చేసిన వరుణ్ తేజ్ అసహనాన్ని ప్రదర్శిస్తుంటే `ఎందుకురా కోపం అని తల్లి అడిగితే.. విక్రమాదిత్య కొడుకుగా పుట్టినందుకంటూ వరుఫ్ సీరియస్ అవ్వడం… ఆట గెలవాలంటే నేను గెలవాలి.. ఎందుకంటే ఈ సొసైటీ ఎప్పుడూ గెలిచిన వాడి మాటే నమ్ముతుంది. ఆటని గెలిపించాలనుకునే పిచ్చోడ్ని మాత్రం గెలక్కూ… వంటి సన్నివేశాలతో `గని` ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్ లోనే దాదాపుగా కథేంటో.. హీరో లక్ష్యం ఏంటో దర్శకుడు క్లియర్ గా చెప్పేశాడు.

సునీల్ శెట్టి ఉపేంద్ర జగపతిబాబు నదియా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ కఠోరంగా శ్రమించాడు. బాక్సర్ గా కనిపించడం కోసం 24 గంటలు శ్రమించాడా? అనేంతగా ఈ సినిమా కోసం వర్కవుట్ లు చేయడం తెలిసిందే.

సరికొత్త స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంతో వరుణ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నాడని తెలుస్తోంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ మదర్ సెంటిమెంట్ తో పాటు లవ్ స్టోరీని కూడా టచ్ చేస్తున్నట్టుగా చూపించింది. ఓవరాల్ గా యాక్షన్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది.