Templates by BIGtheme NET
Home >> Cinema News >> #RRR : అనీల్ రావిపూడి ఇంటర్వ్యూలో కొత్త కోణం తీస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

#RRR : అనీల్ రావిపూడి ఇంటర్వ్యూలో కొత్త కోణం తీస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఈ సమయంలో ఫ్యాన్స్ చేస్తున్న హంగామా కూడా అంతా ఇంతా కాదు. ఇద్దరు హీరోలు కలిసి నటించినా కూడా ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో వేరు వేరుగా ట్రెండ్ చేస్తూ.. తమ హీరో గొప్ప అంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవల ఎన్టీఆర్ అభిమానులు నిర్వహించిన కార్యక్రమాలు కాని.. ఆ తర్వాత చరణ్ అభిమానులు చేపట్టిన కార్యక్రమాలు కాని చూస్తుంటే మొత్తం గొడవ పతాక స్థాయికి చేరుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెద్ద ఎత్తు సోషల్ మీడియాలో ఇద్దరు హీరోలకు సంబంధించిన అభిమానులు పోటా పోటీగా చేస్తున్న హడావుడి ఇప్పుడు పతాక స్థాయికి చేరడంతో చిత్ర యూనిట్ సభ్యుల్లో ఆందోళన మరింతగా పెరుగుతోంది.

తాజాగా అనీల్ రావిపూడి తో చరణ్.. ఎన్టీఆర్ మరియు జక్కన్న లు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అనీల్ రావిపూడి చాలా సరదాగా ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగడం ముగ్గురు కూడా అంతే సరదాగా సమాధానాలు చెప్పడం జరగింది. అయితే స్వతహాగా కాస్త ఎక్కువగా మాట్లాడుతూ జోవియల్ గా ఉండే ఎన్టీఆర్ ఆ ఇద్దరితో పోల్చితే కాస్త ఎక్కువ పార్ట్ ను ఇంటర్వ్యూలో తీసుకున్నాడు. దాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు హైలైట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ లో ఎన్టీఆర్ డామినేషన్ క్లీయర్ గా కనిపిస్తుంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు బిట్ లు బిట్ లుగా ఇంటర్వ్యూ వీడియో లను షేర్ చేస్తూ రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ ఎన్నో రెట్లు ఎక్కువగా మాట్లాడుతూ ఎంటర్ టైన్ చేశాడు అంటూ వింత ప్రచారం మొదలు పెట్టారు. ఈ విషయంలో ఎవరికి తోచిన విధంగా వారు చేస్తున్న కామెంట్స్ కు మరియు ట్రోల్స్ కు పీక్స్ లో చర్చ మొదలయ్యింది.

ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా తీసుకుని సోషల్ మీడియాలో ఈ స్థాయిలో హడావుడి చేస్తున్న అభిమానులు సినిమా విడుదల తర్వాత ఏం చేస్తారో అనే అనుమానం తో కొట్టుమిట్టాడుతూ ఉంటారు.

సినిమా లో ఒక హీరో గురించి మరో హీరో ఫ్యాన్స్ బ్యాడ్ టాక్ ను ప్రచారం చేస్తే పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు హీరోల అభిమానులు సంయమనం పాటిస్తూ సినిమాను ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం.