సర్కారు వారి ‘పెన్నీ’ పాట.. సూపర్ స్టైలిష్ లుక్ లో మహేష్..!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ”సర్కారు వారి పాట”. ఇందులో మహేష్ సరసన తొలిసారిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ – టీజర్ – స్పెషల్ పోస్టర్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలానే ఇటీవల వచ్చిన ‘కళావతి’ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే 90 మిలియన్లకు పైగా వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా రెండో పాటను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.

‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ‘పెన్నీ’ అనే పాటను మార్చి 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో మహేష్ బాబుకు సంబంధించిన ఓ పోస్టర్ ని వదిలారు. ఇందులో మహేష్ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని ఉబర్ కూల్ అండ్ సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. లెదర్ జాకెట్ – బ్లాక్ ప్యాంట్ లో చాలా అందంగా కనిపిస్తున్నారు.

పెన్నీ అంటే డబ్బులు అని అర్ధం వస్తుంది. ‘సర్కారు వారి పాట’ సినిమా బ్యాక్ డ్రాప్ కూడా డబ్బుతో ముడిపడి ఉంటుందని టాక్. ఇప్పుడు ‘పెన్నీ’ పాట ఎస్ఎస్ థమన్ మార్క్ కంపోజిషన్ తో డబ్బుల గురించి ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సరిగమ సౌత్ నుంచి రాబోతున్న ఈ సెకండ్ సింగిల్ కోసం అభిమానులు – సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని – వై. రవిశంకర్ – రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.

ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్ – లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాలో సముద్ర ఖని – ప్రకాష్ రాజ్ – వెన్నెల కిషోర్ – సుబ్బరాజు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 12వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.