
Loosing my husband a big loss in my life Surekha Vani
తెలుగు పరిశ్రమలో అందమైన క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. అందులో ఒకరు సురేఖావాణి. ఆమె చేసిన సినిమాలలో తెలుగుదనం నిండిన పాత్రలతో అభిమానులను అలరించే సురేఖావాణి.. చేసే అన్నీ పాత్రలలో ఎక్కువగా ఓ తల్లిగా అక్కగా వదినగా ఇలా ఇచ్చిన ప్రతి క్యారెక్టర్లో ఒదిగిపోయే టాలెంట్ కలిగి ఉన్నారు. కానీ సురేఖావాణి అంటే కేవలం తెలుగుదనమే కాదు ఆమెలో ఒక ఈతరం మోడ్రన్ మదర్ కూడా ఉంది. ఎందుకంటే సురేఖావాణి సోషల్ మీడియా అకౌంట్స్ చూసినట్లయితే అర్ధమవుతుంది. ఈ మధ్య సినిమాలలో అరుదుగా కన్పిస్తున్న సురేఖావాణి సోషల్ మీడియాలో మాత్రం ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా చక్కగా చీర కట్టుకొని ఉంటుందేమో అనుకుంటే పొరపాటే. కొత్త కొత్త మోడ్రన్ డ్రెస్సులతో ఇంస్టాగ్రామ్ మొత్తం ఊపేస్తుంది. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. సురేఖావాణి తన ఇంస్టాగ్రామ్ లో అప్పుడప్పుడు తన కూతురుతో దిగిన ఫోటోలను షేర్ చేస్తుంది. అయితే కూతురిని ఎంత మోడ్రన్ గా పెంచుతుందో.. తాను కూడా కూతురితో మోడ్రన్ గా తయారవుతుంది.
అయితే సోషల్ మీడియా బాధితులలో సురేఖ కూడా ఒకరు. ఒంటరిగా కనిపించిన ప్రతిసారి లేదా ఎవరైనా మగవారితో మాట్లాడుతున్నా కూడా ఆమె పై సృష్టించే పుకార్లను వింటూ భరిస్తూ వస్తుంది. అలాగే తాజాగా అలాంటి పుకార్ల పై స్పందించి క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకుందట. సమాజంలో భర్త లేని ఆడవారిని ఎలా చూస్తారో తనకు తెలుసనీ.. కానీ నాతో కనిపించిన ప్రతివారితో నేను మంచి బంధాన్ని మాత్రమే కలిగి ఉన్నాను. ప్రస్తుతం నా లైఫ్ నేను స్వేచ్ఛగా జీవిస్తున్నాను. కానీ నా జీవితంలో నా భర్తను కోల్పోవడమే అతిపెద్ద లోటు” అంటూ చెప్పుకొచ్చింది. అంతేగాక ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో.. “నా జీవితం నా ఇష్టం నాకు నచ్చినట్లు నేను జీవిస్తాను. నా జీవితాన్ని నా కూతురిని ఎవరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఇద్దరం కలిసి పబ్స్ షికార్లు సినిమాలు ఇలా అన్నింటికీ వెళ్తాము. నన్ను నా తల్లి ఎలా పెంచిందో.. నేను నా కూతురిని అంతే స్వేచ్ఛ భావాలతో పెంచుతాను. ఇంకా నా కూతురిని సినిమాల్లోకి పంపిస్తారా అనే విషయం పై తను వెళ్తానంటే నేను అడ్డు చెప్పను” అంటూ ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది సురేఖావాణి. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో పలు ప్రశ్నలకు సవాలుగా నిలుస్తున్నాయని అంటున్నారు.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
