అన్నయ్యను మిస్సయినా తమ్ముడిని వదలని రౌడీ బేబి

0

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ సినిమా `ఆచార్య`.కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నవంబర్ మూడవ వారం నుంచి ప్రారంభం కానుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్చరణ్ నిర్మిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు చిరంజీవి తమిళ బ్లాక్ బస్టర్ `వేదాళం` రీమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే.

ఇందులో ఓ కీలక పాత్ర కోసం సాయిపల్లవిని తీసుకున్నారని తెలిసింది. కానీ ఆ స్థానంలో కీర్తిసురేష్ ని ఫైనల్ చేయడం ఊహించని ట్విస్ట్. దీనికి చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సాయి పల్లవి ని తప్పించారు. అయితే ఈ సినిమా నుంచి తప్పించినా సాయి పల్లవికి పవన్ సరసన నటించే అవకాశం లభించినట్టు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే. సాగర్ సంద్ర దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో పవన్కు జోడీగా సాయి పల్లవిని ఫైనల్ చేసినట్టు తెలిసింది. ఫిదా బేబీ డ్యాన్సుల స్పీడ్ కు తట్టుకోవాలంటే పవన్ కూడా కాస్త జాగ్రత్త పడాలేమో.. సాయి పల్లవి ప్రస్తుతం రానాతో `విరాటపర్వం`.. నాగచైతన్యతో శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న `లవ్స్టోరీ` చిత్రాలలో నటిస్తోంది.