ఆహా చేతి మా ‘మా వింత గాథ వినుమా’

0

ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు కంటెంట్ తో వచ్చిన ‘ఆహా’ చిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పాత సినిమాలతో పాటు అప్పుడప్పుడు చిన్న సినిమాలు వెబ్ సిరీస్ లతో ఆహా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలను తీసుకు వచ్చి డబ్బింగ్ చేసి సక్సెస్ ను అందుకున్న ఆహా ఇటీవల కలర్ ఫొటో సినిమాను విడుదల చేసింది. కృష్ణ అండ్ ఇజ్ లీలా సినిమా ఆహాలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో నటించిన సిద్దు మరో సినిమాతో రెడీ అయ్యాడు. ఆ సినిమాను కూడా ఆహాలో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దం అయ్యారు.

ఆదిత్య మందాల దర్శకత్వంలో సంజయ్ రెడ్డి నిర్మించిన ‘మా వింత గాథ వినుమా’ అనే సినిమాను సిద్దు జొన్నలగడ్డ మరియు సీరత్ కపూర్ లు జంటగా చేశారు. వీరిద్దరు ఇంతకు ముందు కృష్ణ అండ్ ఇజ్ లీలా సినిమాలో కూడా నటించారు. ఈతరం యూత్ కు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకుని సిద్దు వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మా వింత గాథ వినుమా సినిమాకు కూడా సిద్దు రచన సహకారం అందించాడు. ఈ సినిమాను ఆహాలో నవంబర్ 13న దీపావళి సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా అల్లు అరవింద్ తాజాగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. మంచి కంటెంట్ అవ్వడం వల్లే విడుదలకు ముందుకు వచ్చినట్లుగా ఆయన పేర్కొన్నాడు.