Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘జగన్.. నువ్వు నాకు ఆఫర్ ఇవ్వకపోయినా అందుకే ఫీల్ కాలేదు’

‘జగన్.. నువ్వు నాకు ఆఫర్ ఇవ్వకపోయినా అందుకే ఫీల్ కాలేదు’


తెలుగమ్మాయి మాధవీలత ‘నచ్చావులే’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. అయితే ఈమె సినిమాలతో కంటే తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా ఫేమస్ అవుతూ వచ్చింది. సినిమాలకు దూరమైన తరువాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మాధవీ లత.. సినీ రాజకీయ సమకాలీన అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా మాధవీ లత ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ వ్యక్తిత్వంపై ఓ పోస్ట్ పెట్టింది. వివరాల్లోకి వెళ్తే పూరీ జగన్నాథ్ ఇటీవల పోడ్ కాస్ట్ లో ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో తన అనుభవాలు భావాలు ఆలోచనలు తన మాటలతో షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడవాళ్లపై ఈ సమాజం తీరుపై మాట్లాడుతూ ఆడవారికి స్ఫూర్తినిచ్చే అంశాలు చెప్పుకొచ్చారు. మాతృస్వామ్య వ్యవస్థ సతీసహగమనం బాల్య వివాహాలు వరకట్నం అత్యాచారాలు.. ఇలా సమాజంలో మహిళలపై జరుగుతున్న దుర్ఘటనల గురించి తన అభిప్రాయాన్ని పూరీ మ్యూజింగ్స్ లో షేర్ చేశారు. దీనిపై మాధవీ లత స్పందించింది.

మాధవీ లత ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ పెడుతూ ”జగన్.. నేను నిన్ను 2007లో కలిశాను. అప్పుడు ఇప్పుడు స్త్రీ గురించి అవే మాటలు. అందుకే నువ్వు ఎప్పటికీ నా ఫేవరేట్ పర్సన్. నేను కలిసిన సమయంలో నన్ను ఎలా ట్రీట్ చేశావో ఇప్పటికీ గుర్తుంది. కాఫీ తాగు న్యూడిల్స్ తిను కుక్క పిల్లలతో ఆడుకో మూవీస్ చూస్తావా అంటూ నన్ను ఇంట్లో పిల్లలా చూసావ్. మొదటి సారి మిమ్మల్ని కలవడానికి మీ ఆఫీస్కి వచ్చాను. కానీ నన్ను ఫ్రెండ్ లా మధు అంటూ మీ ఇంట్లో అమ్మాయిని చూసినట్లు చూసావ్. అందుకే నాకు మూవీ ఆఫర్ ఇవ్వకపోయినా ఫీల్ కాలేదు. నాకు గుర్తుంది నువ్వు అప్పుడెలా ఉన్నావో ఇప్పుడూ సేమ్.. ఓపెన్ మైండెడ్ పర్సన్. ఈ సొసైటీ ఎలా ఉంటుందో నీ మూవీస్ లో చుపిస్తావ్. అలాగే సొసైటీలో ఆడదాని బతుకేంటో మాటలతో చెబుతావ్. అందుకే ఎవరేమనుకున్నా నాకు అవకాశం ఉన్న ప్రతిచోటా జగన్ చాలా మంచివాడనే చెప్తా. మంచోడు అనే పదం నీకు నచ్చదని తెలుసు. అయినా స్త్రీని ఉద్దేశిస్తూ నీవు చెప్పిన మాటలు నన్ను ఎంతాగానో ఆకట్టుకున్నాయి. నేను నిన్ను గౌరవిస్తున్నా. అయితే నిజాలను డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు కామెంట్స్ చేస్తారు. ఇప్పటికీ ఇదే సమాజం. ఇదే నిజం.. ఇదే నిజం.. బలై పోతున్న నా ఫ్రెండ్స్ జీవితాలే సాక్షం” అని చెప్పుకొచ్చింది.