Templates by BIGtheme NET
Home >> Cinema News >> మహేష్- అమీర్ మల్టీస్టారర్ .. జక్కన్న మైండ్ లో?

మహేష్- అమీర్ మల్టీస్టారర్ .. జక్కన్న మైండ్ లో?


మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అందరివాడు అన్న సంగతి తెలిసిందే. షారూక్ .. సల్మాన్ ఖాన్ గొడవలో ట్రబుల్ సూటర్ పాత్రను పోషించిన అమీర్ ఖాన్ .. ఆ ఇద్దరితోనూ స్నేహంగా ఉంటాడు. అటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ తోనూ ఎంతో సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇటు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సహా టాప్ హీరోలతో ఆయన టచ్ లో ఉన్నారన్న ప్రచారం ఉండనే ఉంది.

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి పైనా అమీర్ ఖాన్ అభిమానం కురిపించిన సందర్భాలున్నాయి. సౌత్ నుంచి బాహుబలి సాధించిన అసాధారణ విజయం నేపథ్యంలో రాజమౌళితో కలిసి పని చేసేందుకు అమీర్ సిద్ధమయ్యారు. ఆ విషయాన్ని బహిరంగ వేదికపైనే ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఇక అమీర్ ఖాన్ పై రాజమౌళి నిరంతరం ఆసక్తిగానే ఉన్నారు. పలుమార్లు మిస్టర్ పర్ఫెక్ట్ పని తీరును ప్రశంసించిన రాజమౌళి ఆయనతో సినిమా చేసే అవకాశం ఉంటే విడువనని కూడా అన్నారు.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తో ఎస్.ఎస్ రాజమౌళి గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నారనడానికి లేటెస్ట్ వెంచర్ ఎగ్జాంపుల్. ఆర్.ఆర్.ఆర్ హిందీ వెర్షన్ లో కీలక పాత్రల పరిచయానికి అమీర్ ఖాన్ గొంతును అరువివ్వనున్నారు. ఆ మేరకు అమీర్ తో రాజమౌళి భేటీ ఆసక్తిని కలిగిస్తోంది. హిందీ వెర్షన్ ప్రమోషన్స్ కి అమీర్ అంగీకరించారు. రాజమౌళి స్వయంగా అమీర్ సహాయం కోరారు. ఆర్.ఆర్.ఆర్ హిందీ వెర్షన్ లో ఎన్టిఆర్ (భీమ్).. రామ్ చరణ్ (రామరాజు) పాత్రలను పరిచయం చేయడానికి అమీర్ ఖాన్ గొంతు అరువివ్వనున్నారు.

అన్ని దక్షిణాది భాషలలో భీమ్ (ఎన్టీఆర్) పరిచయం కోసం రామరాజు (రామ్ చరణ్).. రామరాజు రామ్ చరణ్ పరిచయం కోసం ఎన్టీఆర్ తన గొంతును ఇచ్చారు. హిందీ లో అమీర్ గొంతు వింటారు. ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాతోనే హిందీ చిత్రసీమలోకి ప్రవేశిస్తున్నారు ఎన్టీఆర్. అలాగే జంజీర్ తర్వాత రామ్ చరణ్ కి ఇదో గొప్ప సదవకాశం అని భావిస్తున్నారు. ఆలియాభట్.. అజయ్ దేవగన్ లాంటి స్టార్లు ఆర్.ఆర్.ఆర్ లో కీలక పాత్రలు పోషించడం అక్కడ మార్కెట్ కి పెద్ద ప్లస్ కానుంది. అన్నట్టు ఖాన్ తో రాజమౌళి సినిమా ఎప్పటికి సాధ్యమవుతుంది? మహేష్ తో సినిమా చేస్తున్నానని ప్రకటించారు కాబట్టి ఆర్.ఆర్.ఆర్ తర్వాత మహేష్ – అమీర్ ఖాన్ కాంబోలో ఏదైనా ప్లాన్ చేస్తారా? ఒకవేళ ఇదే నిజమైతే అది భారీ పాన్ ఇండియా (వరల్డ్) సినిమాగా అవతరిస్తుంది. ప్రస్తుతానికి ఇది ఊహ మాత్రమే. నిజం అవ్వాలనే ఆకాంక్షిద్దాం.