Templates by BIGtheme NET
Home >> Cinema News >> గౌతమ్ కోసం అలా ప్లాన్ చేస్తున్న మహేష్

గౌతమ్ కోసం అలా ప్లాన్ చేస్తున్న మహేష్


సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ తో పాటు తరచుగా తన ఫ్యామిలీ విశేషాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు నమ్రత. మహేష్ కుమార్తె సితార కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని క్రేజీ సెలబ్రిటీగా మారిపోయింది. చిన్న వయసులోనే పలు యాడ్ షూట్ లు కూడా చేస్తుంది.

ఇక మహేష్ కొడుకు గౌతమ్ విదేశాల్లో చదువుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తమ పిల్లల గురించి, అలాగే మహేష్ గురించి ఎలాంటి మంచి విషయం ఉన్నా నమ్రత వెంటనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా నమ్రత తన కొడుకు గౌతమ్ గురించి చేసిన ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.’ ఇకపై గౌతమ్ ఘట్టమనేని ఫ్యామిలీకి దూరంగా ఉండబోతున్నాడు. గౌతమ్ ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళుతున్నాడు.

న్యూయార్క్ యూనివర్సిటీలో గౌతమ్ కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాడు’ అంటూ నమ్రత తన పోస్టులో తెలిపింది. అంతేకాకుండా..’ నీ హార్డ్ వర్క్, ఫ్యాషన్, డిటర్మినేషన్ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి’ అంటూ కొడుకు గురించి సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. దీంతో నమ్రత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. దాదాపు ఈ పోస్ట్ కి 83 వేలకు పైగా లైక్స్ రావడం విశేషం.

ఇక ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ అంతా గౌతమ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అయితే గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలో ఏం చదవబోతున్నాడు అనే విషయాన్ని మాత్రం నమ్రత రివిల్ చేయలేదు. మొత్తం మీద గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదవబోతున్నడనే విషయం తెలిసి మహేష్ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాగా ఈ ఉన్నత చదువులు పూర్తయ్యేంతవరకు గౌతమ్ కుటుంబానికి దూరంగా విదేశాల్లోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు అభిమానులు గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. మరి చదువు అయిపోయాక అయినా గౌతమ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా? లేదా అనేది చూడాలి. ఇక మహేష్ బాబు విషయానికొస్తే, ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.