ఆహాలో రాబోతున్న చలం ‘మైదానం’

0

తెలుగు ఓటీటీ ఆహా లో కంటెంట్ విషయంలో జెట్ స్పీడ్ తో దూసుకు వెళ్తున్నారు. మీడియం బడ్జెట్ సినిమాలు మరియు టాక్ షోలు ఇంకా వెబ్ సిరీస్ లు ఇలా కంటెంట్ తో ఆహా ప్రేక్షకులను ముంచెత్తుతున్నారు. తాజాగా మరో మూవీ ని ఆహా వారు ప్రకటించారు. వేణు ఉడుగుల వంటి విలక్షణ దర్శకుడి నిర్మాణంలో రూపొందుతున్న ‘మైదానం’ సినిమా ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మైదానం అనేది ప్రముఖ రచయిత చలం 1927లో రాసిన ఒక నవల. ఆ నవల కథ ఆధారంగా అదే టైటిల్ తో మైదానం సినిమాను రూపొందించారు.

వేణు ఉడుగుల నిర్మిస్తున్న ఈ ఆహా సినిమాకు కవి సిద్దార్థ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైదానం నవల ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అలాంటి నవల ఆధారంగా సినిమా అంటే ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుంది. ఆర్ట్ ఫిల్మ్ లా కాకుండా కాస్త కమర్షియల్ టచ్ కూడా ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న మైదానం త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది.

ప్రస్తుతం రానాతో విరాటపర్వం సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు వేణు ఉడుగుల మైదానంపై ఆసక్తితో ఇష్టంతో ఈ సినిమాను నిర్మించేందుకు వచ్చాడట. మీడియం బడ్జెట్ లో కొత్త వారితో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించబోతున్నారు. మైదానం సక్సెస్ అయితే చలం మరిన్ని రచనలు సినిమాలుగా వచ్చే అవకాశం ఉంది.