కోవిడ్ నుంచి కోలుకుని వీధి షికార్ తో షేక్ చేసిన నటి

0

బాలీవుడ్ హాటీ మలైకా అరోరాకు కొన్ని వారాల ముందే COVID-19 ఉన్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే దాని నుండి కోలుకుంది. ఈలోగానే ఇదిగో ఇలా వీధుల్లో ప్రత్యక్షమై షేక్ చేయడం యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. మలైకా అరోరా ముసుగు వేసుకుని ఇదిగో ఇలా వీధుల్లో వాకింగ్ చేస్తూ ట్రీటిస్తోంది.

ఇదివరకూ అభిమానులు శ్రేయోభిలాషులు మలైకా అరోరా COVID-19 తో బాధపడుతున్నట్లు ప్రకటించినప్పుడు ఆందోళన చెందారు. కానీ ఇప్పుడు ప్రియుడు అర్జున్ సహా అందరూ హ్యాపీనే. మొన్నటికి మొన్న సోదరి అమృత అరోరాను కలవడానికి మలైకా తన నివాసం నుండి బయటికి వచ్చింది. స్వతహాగానే ఫిట్నెస్ ఔత్సాహికురాలు కావడంతో.. తన సాధారణ వ్యాయామ దినచర్యను ఇప్పటికే ప్రారంభించేసిందట. అందుకు ఈ తాజా ఫోటోలే రుజువు.

జస్ట్.. కొన్ని గంటల క్రితం బాంద్రా వీధుల్లో నడుస్తున్నప్పుడు మలైకా అరోరా పై ఫ్లాష్ ల మెరుపులు మొదలయ్యాయి. పూర్తిగా జిమ్ వేర్ లో కనిపిస్తున్న ఫోటోలు అంతర్జాలాన్ని చుట్టేశాయి. ఇక ఇంతకుముందు ప్రియుడు అర్జున్ కపూర్ కి కూడా COVID-19 సోకిన సంగతి తెలిసిందే. ఇటీవలే కోలుకుని అతడు కూడా వ్యాయామం చేస్తున్నాడట. లాక్ డౌన్ కి ముందు అర్జున్ కపూర్ – మలైకా అరోరా కలిసి రకరకాల కార్యక్రమాల్లో కలిసి కనిపించారు. ఇది వివాహ పార్టీలు లేదా ఫ్యాషన్ షోలు అయినా.. ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు కలిసే షికార్లు చేశారు. ఇటీవల ఎవరికి వారు వ్యాధి నుంచి కోలుకుని జాగ్రత్తగానే ఉంటున్నారట.