ఆ పని చేయలేక 30 సినిమాలు వదులుకుందట

0

సోషల్ మీడియాలో సెలబ్రెటీలు లైంగిక వేదింపులు లేదా అఘాయిత్యాల గురించి స్పందించిన సమయంలో చాలా మంది నెటిజన్స్ వారిని ట్రోల్స్ చేస్తున్నారు. మీరు నటిస్తున్న సినిమాలు చూడటం వల్లే యువత చెడిపోతుంది. మీ సినిమాల ధోరణి మారనంత వరకు అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి అంటూ వింత వాదన చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇటీవల జరిగిన హథ్రస్ ఘటనపై స్పందించిన మల్లిక శెరావత్ ఆవేదన వ్యక్తం చేయగా ఒక నెటిజన్ స్పందిస్తూ.. మీరు చెబుతున్న నీతి సూత్రాలకు మీరు నటించే సినిమాల్లోని పాత్రలకు పోలికే లేదు కదా అంటూ కామెంట్ చేశాడు. అతడి కామెంట్ కు మల్లికా కాస్త సీరియస్ గానే స్పందించింది.

సినిమాల వల్ల ఇబ్బంది అనుకున్నప్పుడు చూడటం మానేయాలి. మీకు ఏది మంచి అనిపిస్తే అది చేసే విచక్షణ ఉన్నప్పుడు సినిమాలు చేయడం వల్లే అఘాయిత్యాలు అంటూ మాట్లాడటం ఏంటంటూ అసహనం వ్యక్తం చేసింది. నేను చేసిన సినిమాల వల్ల అత్యాచారాలు జరుగుతాయని భావించినప్పుడు చూడటం మానేయండి అంటూ అతడికి రిప్లై ఇచ్చింది. అదే విషయమై ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అత్యాచారాలు ఎప్పుడు ఎక్కడ జరిగినా కూడా అమ్మాయిల డ్రస్ తప్పుగా ఉంది.. వారి ప్రవర్తన సరిగా లేదు అంటారు. జనాలు ఆ ఆలోచన విధానం ఇంకా ఎప్పుడు మార్చుకుంటారో అంది.

తాను ఏ విషయంలో అయినా నిర్మొహమాటంగా ఉంటాను. నాకు నచ్చని పని చేయను అని నిర్మొహమాటంగా చెప్పేస్తాను. నేను నచ్చని పని చేయక పోవడం వల్లే కెరీర్ లో 30 సినిమాల వరకు వదులుకున్నాను. నేను సినిమాల్లో కనిపించేదానికి నా నిజ జీవితంలోని నా స్వభావంకు పూర్తి విభిన్నంగా ఉంటాను. సినిమాల్లో నన్ను చూసి నా రియల్ లైఫ్ ను ఊహించుకోవద్దంటూ రిక్వెస్ట్ చేసింది.