పింక్ రవికెలో మెంటలెక్కించిన మన్నారా

0

కోక రవికెలో సోగ్గత్తె అందం వర్ణించాలా? అందం అంతా రాశి పోసినట్టుగా ఆ కిక్కే వేరు. ఇదిగో ఇక్కడ యంగ్ బ్యూటీ మన్నారా చోప్రా చీరలో చెలరేగిపోయింది. కుర్రకారుకు చెమటలు పట్టించేసింది. ఆ పవిట కొంగుకు కోపం వస్తే అంతేలే అన్నట్టుగా ఉంది ఈ వేషధారణ.

టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లు దక్కకపోయినా మీడియం రేంజ్ స్టార్ల సరసన అవకాశాలు అందుకుంటోంది మన్నారా. ముంబై టు హైదరాబాద్ ఈ అమ్మడు రెగ్యులర్ గా షికార్లు చేస్తూ ఇక్కడ అవకాశాల్ని విడిచిపెట్టడం లేదు మరి. ఇక ఇటీవల సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో చెలరేగుతోంది.

ఎవ్వర్ లేటెస్ట్ ఫోటోషూట్ లో మన్నారా దుమారమే రేపింది. ఇంతకుముందు పుస్తకాలు చదువుతూ థై థండర్ షోతో చెలరేగిన మన్నారా.. ఈసారి అందుకు కాంట్రాస్ట్ గా చీర రవికెలో దర్శనమిచ్చింది. పసుపు గోల్డ్ మిక్స్ డ్ పరికిణీపై పింక్ టాప్ తో దుమారం రేపింది. 2019లో సీత అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సినిమాలేవీ లేవ్. అయితే ప్రస్తుతం కథలు విని బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోందట. అందుకే ఇస్పీడ్ అన్నమాట.